ఉత్తరాయణం

వెంటాడుతున్న కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగరాలను కాలుష్యభూతం ఆవహిస్తోంది. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంతగా అక్కడి వాతావరణం కలుషితమైపోవడం బాధాకరం. కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పంటలను కాల్చివేయడం వంటి చర్యల వల్ల రాజధానిలో వాతావరణం కలుషితమైపోయింది. అందువల్లే ఆ మధ్య దీపావళి సందర్భంలో బాణసంచా విక్రయాలు, వినియోగంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కోర్టు కూడా కొన్ని ఆంక్షలను విధించింది. ప్రజల్లో మార్పు వస్తే తప్ప మంచిరోజులు రావు. కాలుష్యం మరింత పెరగకుండా అందరూ చొరవ చూపాలి.

-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్