ఉత్తరాయణం

ఉపయోగపడని ఆరోగ్య కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఉన్న ఆరోగ్య కేంద్రాల వల్ల ప్రయోజనం లేదు. ఆ కేంద్రాలలో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడం మొదటి సమస్య. తగినంత మంది సిబ్బంది, తగినన్ని ఔషధాలు లేని ఆరోగ్య కేంద్రాల వల్ల ఒరిగేది ఏమిటి? వందల సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది తిరగాడే సంస్థల్లో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వానికి నగుబాటు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి విశ్వవిద్యాలయాలలోని ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి.
-కందగట్ల శ్రవణ్‌కుమార్, వరంగల్
విలువలేని విమర్శలు
గుజరాత్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రచార సారథి రాహుల్‌గాంధీ చేస్తున్న విమర్శలు సహేతుకంగా లేవు. దేశం ఆర్థికమాంద్యం దిశగా పయనిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ నోటికి వచ్చినట్లు మాట్లాడటం రాజకీయ నాయకులకు అలవాటే. సెనె్సక్స్, నిఫ్టీలు రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతూంటే అర్థం ఏమిటి? ఐరోపా అభివృద్ధి సూచికకంటే భారత్ ప్రగతి బాగుందని చెబుతుంటే మన ప్రతిపక్షాలు మాత్రం మరోలా వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. కేవలం రాజకీయ వైరంతో అర్థం లేని విమర్శలు చేయడం సరికాదు.
-కృష్ణ, కొండయ్యపాలెం