ఉత్తరాయణం

అదనపు టీచర్లు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడివల్ల న్యాయం జరగదు. అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులను చెప్పడం ఒకరివల్ల సాధ్యమేనా? తరగతికి ఒకరిని చొప్పునైనా ఉపాధ్యాయులను నియమిస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
-కె.హెచ్.శివాజిరావు, హైదరాబాద్
దుబారా ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగినంత ఆదాయం లేదు. నిధుల విడుదలలో కేంద్రం నుంచి సానుకూల స్పందన కనపడటం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు పొదుపు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతుంటారు. ఆచరణలో ఆయన మాత్రం పొదుపు పాటించడం లేదు. జర్మనీ నుంచి సైకిళ్లను అత్యధిక ధరలకు కొనాలన్న ఆలోచన సరైనది కాదు. అక్కడి వ్యవస్థకు వీలుగా సైకిల్ ట్రాక్‌లు, స్టేషన్లు ఉన్నాయి. మనదగ్గర ఆ అవసరం తక్కువే. దుబారా లేకుండా చూడటం ప్రభుత్వం తక్షణ కర్తవ్యం.
-బి.అఖిలశ్రీనివాస్, గూడవల్లి
దీపానికి చెద
అర్హులైన అందరికీ నామమాత్రపు ధరకు సిలిండర్, రెగ్యులేటర్, స్టౌ అందించారు. మన రాష్ట్రంలో ‘దీపం’ ద్వారా లక్షలాది మందికి పంపిణీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం గత పదహారు నెలల్లో పంతొమ్మిది సార్లు గ్యాస్ ధర పెంచింది. అల్పాదాయ వర్గాలకు ఈ పెంపు శరాఘాతంగా మారింది. అల్పాదాయ వర్గాలకిచ్చే గ్యాస్ రాయితీ కొనసాగిస్తే ఆమోదయోగ్యంగా ఉంటుంది.
-యర్రమోతు ధర్మరాజు,
ధవళేశ్వరం