ఉత్తరాయణం

పాసింజర్ రైలు నడపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పుగోదావరిలోని కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి-రత్నగిరి (అన్నవరం) మధ్య పాసింజర్ రైలు నడిపితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కాకినాడ పోర్టు ఎగువ, దిగువ పాసింజర్ రైళ్లు శుభయాత్రలో భాగంగా నడిపితే ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం కాకినాడ-కోటిపల్లి రైలు మంగళవారం తప్ప అన్ని రోజుల్లో ఒక పర్యాయం, ఎగువ దిగువ రాకపోకలు సాగిస్తోంది. వేలాదిమంది భక్తులు కోటిపల్లి, అన్నవరం క్షేత్రాలకు వస్తూంటారు. ప్రస్తుతం వారానికి ఒకసారి నడుపుతున్న రైలును అన్నవరం వరకు పొడిగించి ఆదరణను అంచనావేసి తదుపరి చర్యలు తీసుకోవాలి.
-సుధాకర్ పట్నాయక్, కాకినాడ
అనుమతితోనే సినిమా తీయాలి
ఎన్టీఆర్‌పై సినిమా తీయాల్సిందేనని ఓ పాఠకుడు రాసిన లేఖ చూశాక ప్రజల హక్కుల గురించి చెప్పాల్సి వస్తోంది. ‘మండలాధీశుడు’ తీసిన రోజుల్లో గుప్తత, కాపీరైట్ చట్టాలపై అవగాహన లేదు. పైగా అది కల్పికథ అని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు చట్టాలు పదునుతేలాయి. ప్రతి వ్యక్తికి కొన్ని తెరవెనుక విషయాలు కెలికి గోప్యతకు భంగం కలిగించడం సభ్యసమాజం అనుమతి తీసుకోవాలి. ఆస్కార్ అవార్డులు సాధించిన ‘గాంధీ’ చిత్రం స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివి ఇందిరాగాంధీ మార్పులు, చేర్పులు చెప్పిన తరువాత ఆ చిత్రం తీశారు.
-కె.ఎల్.ప్రసన్న, పేర్రాజుపేట
ప్లాస్టిక్‌ను నిషేధించాలి
పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వాలు ద్వంద్వవైఖరిని అనుసరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను ప్రచారం చేస్తున్న ప్రభుత్వం దానిని నిషేధించే విషయంలో వౌనం వహిస్తోంది. ముఖ్యంగా క్యారీబ్యాగుల వినియోగంపై ఉక్కుపాదం మోపకపోవడం బాధాకరం. ప్రతీ వస్తువు, కూరగాయలు తీసుకువెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లనే వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా ధ్వంసం కావడానికి లక్షల సంవత్సరాలు సరిపోవు. అన్నీ తెలిసి ప్రభుత్వాలు, ప్రజలు స్పందించరు. అది మన మనుగడకే ప్రమాదం.
-ఎం.కనకదుర్గ, తెనాలి
బాల కార్మికులను ఆదుకోండి
బాలకార్మిక వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. మన కళ్లఎదుటే చిన్నచిన్న దుకాణాలు సహా పలు సంస్థల్లో చిన్నచిన్న పిల్లలు పనిచేస్తూంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు. బడిఈడు పిల్లలను స్కూళ్లకు పంపితే వారి జీవితాలలో మార్పు వస్తుంది. పద్నాలుగు ఏళ్లలోపువారిని పనిలో పెట్టుకోకూడదని నిబంధనలు ఉన్నా అమలు జరగడం లేదు. ముఖ్యంగా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో మార్పువస్తే తప్ప బాలకార్మికుల కష్టాలు తప్పవు.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్