ఉత్తరాయణం

విద్యావిధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించే కఠిన విద్యావిధానం అమలు చేయాల్సిన రెండు తెలుగు ప్రభుత్వాలపై ఉంది. మార్కులు, ర్యాంకుల విధానం విద్యార్థినీవిద్యార్థుల ఉసురుతీస్తోంది. చిన్నారులను మనుషుల్లా చూడకుండా యంత్రాల్లా పరిగణిస్తూ, వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న కార్పొరేట్ విద్యావిధానం చాలా నష్టాలు కలిగిస్తోంది. కేవలం ఇంజనీరింగ్, వైద్య విద్యపై మక్కువతోనే ప్రాణాలమీదకు తెస్తున్నారు. వ్యాపారం కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు, గొప్పకోసం తల్లిదండ్రులు చిన్నారులను విద్య పేరుతో నాలుగు గోడల మధ్య ఇరికిస్తున్నారు. ఫలితమే విద్యార్థినీవిద్యార్థుల ఆత్మహత్యలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కఠినవైఖరి అవలంబించాలి.
-ఎస్.ఎస్.రాజు, వనస్థలిపురం
అధికారుల తీరు మారాలి
నల్గొండ జిల్లా ట్రెజరీ అధికారుల తీరు మారాల్సి ఉంది. వారి నిర్లక్ష్య వైఖరి వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెననర్లు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లో సిబ్బంది తాత్సారం చేస్తున్నారు. పని పూర్తికాకపోవడంతో పదేపదే కార్యాలయం చుట్టూ తిరగవలసి వస్తోంది. ప్రభుత్వం నుండి సకాలంలో నిధులు విడుదలవుతున్నప్పటికీ చెల్లింపులు మాత్రం జరగడం లేదు. ముడుపులు ఇస్తేనే పని చేస్తున్నారు. దళారుల బెడద ఎక్కువగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించాలి.
-సి.హెచ్.సాయిరాం, నల్గొండ
హామీ అమలు చేయాలి
అరవై ఐదేళ్లు నిండిన ఫించనుదారులకు క్వాంటమ్ ఫించన్ వర్తింప చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలి. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఇంకా ఆ హామి ఆచరణరూపం దాల్చలేదు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. కొన్ని హామీలను అమలు చేసిన చంద్రబాబు ఈ విషయంపై దృష్టి సారిస్తే పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది.
-ఎ.సుధాకర్ రావు, గూడలి (నెల్లూరు)