ఉత్తరాయణం

రిజర్వేషన్ల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు అందివ్వడానికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన రాజ్యాంగ నిర్మాతలు బహుశా ఊహించి ఉండరు రానురాను రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం రిజర్వేషన్లు కల్పించే రోజులొస్తాయని. ప్రస్తుతం ఏపీలో మంత్రివర్గం ఒక్క రోజులోనే బీసీ,ఎస్టీల్లో ఒక్కో కులాన్ని చేరుస్తూ తీర్మానించి, మరి కొన్ని కులాలలకు ముందుముందు ఎస్సీ హోదా ఇస్తామని ప్రకటించడం నిఖార్సయిన రాజకీయ చర్య. కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం విషయంలో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం నియమించిన ముంజునాథ కమిషన్ తన నివేదిక ఇంకా సమర్పించనే లేదు. అయినా ప్రభుత్వం ముందడుగు వేసింది. అంతకుమించిన హడావుడి బోయలను ఎస్టీలుగా గుర్తించడం విషయమై చూపింది. శాస్ర్తియంగా అధ్యయనం చేసింది లేదు. తెగలుగా గుర్తించడానికి పాటించాల్సిన విధి విధానాలున్నాయి. కొన్ని నిబంధనలు ఉన్నాయి. గిరిజన సలహా మండలి పాత్ర ఉండాలి. ఈ పద్ధతులన్నింటినీ తుంగలోతొక్కి అటు గిరిజనులను, ఇటు కొత్త లబ్దిదారులను వంచించారు. కోర్టులు గాని, కేంద్రం కానీ ఈ అశాస్ర్తియ పద్ధతులను తిరస్కరించే వీలుంది గనుక అది వంచనే అవుతుంది. కేవలం రాజకీయ లబ్దికోసం ఇలా కుల రాజకీయ క్రీడల్ని ఆడటం అభిశంసనీయం.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
సెల్ఫీల మోజుతో ప్రమాదాలు
స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత యువత సెల్ఫీల మోజులో పడిపోయింది. చుట్టుపక్కల పరిస్థితులను పట్టించుకోకుండా వారు సెల్ఫీల మోజులో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. చివరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు కూడా వారు ఫోటోల పిచ్చి వదలడం లేదు. ఒక్కోసారి ఆలయ నిర్వాహకులతో గొడవలకూ సిద్ధపడుతున్నారు. యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.
-ఎ.రఘురామారావు గౌడ్, ఖమ్మం