ఉత్తరాయణం

రాహుల్‌కు మంచి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ ఇన్నాళ్లు అమ్మకూచి. అధికారం చేతిలో ఉన్నా ఎవరికీ జవాబు చెప్పాల్సిన పూచీ లేదు. పేచీ లేదు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజల్లోకి వచ్చి తనకు తోచినది చెప్పాడు. అధికారం విషంతో సమానమని, తమ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెత్త అన్నా, మధ్యమధ్యలో సెలవులు పెట్టినా సెల్ఫ్‌గోల్ స్టేట్‌మెంట్లు ఇచ్చినా చెల్లిపోయింది. పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే జయాపజయాలకు బాధ్యతవహించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించబోతున్న రాహుల్ ముందు పెద్ద పరీక్ష ఉంది. జవసత్వాలుడిగిన పార్టీకి బాధ్యత వహించాలి. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. బలమైన భాజపాను ఎదుర్కోవాలి. విపక్షాలను ఒకటిగా చేసే పెద్దరికం కావాలి. ట్విట్టర్, ఉపన్యాసాలలో రాహుల్ వ్యాఖ్యలు ఇదివరికటిలా అపరిపక్వతతో లేవు. దిశానిర్దేశం చేసేవిగానూ లేవు. ప్రజాసమస్యలపై లోతైన అవగాహన, స్థిరమైన భావాల ప్రకటనతో రాజకీయ వ్యూహాలలో రాహుల్ రాటుదేలాలి. పార్టీలోని సమర్ధులైన యువకులను, అనుభవజ్ఞులను తన బృందంగా చేసుకుని ముందడుగు వేయాలి. రాహుల్‌కు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది.

-డి.వి.జి.శంకర రావు, పార్వతీపురం