ఉత్తరాయణం

నల్లకుబేరుల పనిపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నల్లకుబేరుల పనిపడతామని ఎన్నో ప్రకటనలు చేశారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి సంస్కరణలు అమలు చేశారు. బ్లాక్‌మనీ వ్యవహారంలో సాధించినది చాలా తక్కువ. లక్షలకోట్ల రూపాయలు దేశం దాటి నల్లకుబేరుల ఖాతాల్లోకి చేరిపోయాయి. ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తామన్న మోదీ ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి నల్లధనం వ్యవహారంపై దృష్టి సారించాలి. బినామీ ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన చట్టాలకు పదునుపెట్టాలి. అప్పుడే మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపితమవుతుంది.
-ఎం.కనకదుర్గ, తెనాలి
తెలుగువారిలో
చైతన్యం అవసరం
భారతదేశంలో ఎన్ని భాషలున్నప్పటికీ మిగతా ప్రాంతీయ భాషలవారు వ్యక్తం చేసేంత మమకారం మనవారిలో లేదు. ఇప్పటికైనా తెలుగువారిలో భాషాపరమైన చైతన్యం రావాలి. మాతృభాషను రక్షించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలు అందుకు వేదిక కావాలి. ఆంగ్లభాషా వ్యామోహంలోపడి సొంత భాషను చిన్నచూపు చూడటం సరికాదు. ప్రభుత్వాల వైఖరి వల్లే ఇలా జరిగింది. జనంలో చైతన్యం తీసుకువచ్చి తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే తెలుగుభాష పదికాలాల పాటు నిలుస్తుంది. భాషాభిమానులు, సాహితీవేత్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇతోధికంగా కృషి చేయాలి.
-రఫీ, శ్రీకాకుళం
అతివేగంతోనే ప్రమాదాలు
హైదరాబాద్‌తోపాటు పలుచోట్ల వాహన చోదకులు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని, అర్హత లేని బాలబాలికలు వాహనాలను నడుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మోటారు వాహనాల శాఖ అధికారులకు అన్నీ తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అతివేగంగా వాహనాలను నడిపేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
-నీలం శివగంగాధర, వీరపునాయునిపల్లె