ఉత్తరాయణం

దళారులతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మహిళాసంఘాలలోని నిరుపేద మహిళలకు సహాయంగా రూ.25 వేల రూపాయలను అందించాలని తెలంగాణ స్ర్తినిధి బ్యాంక్ మేనేజింగ్ కమిటీ నిర్ణయించడం అభినందనీయం. ఒక సామాజిక పథకం ద్వారా ఇలా సహాయం అందించనున్నారు. ఇది లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆదుకుంటుంది. అయితే ఈ పథకం ద్వారా లబ్దిపొందాల్సిన పేదలకు సరైన అవగాహన ఉండదు. దళారీల మోసానికి వారు గురికాకుండా చక్కటి విధానాన్ని అనుసరించి పేదలకు మేలు జరిగేలా అమలు చేయాలి.
-సూరం అనిల్, వరంగల్
రాచకొండ ఘనత చాటాలి
ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తోంది. రాచకొండ రాజుల ఆస్థానంలో పురాణఇతిహాసాలు, అలంకార శాస్త్రాలు, సంగీత సాహిత్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటికి ప్రాణం పోశారని చరిత్ర చెబుతోంది. రాచకొండను పాలించిన మూడో సింగ భూపాలుడు హయాంలో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వర్థిల్లింది. శ్రీనాథుడు, బమ్మెర పోతన ఇక్కడ అనేక రచనలు చేశారు. ప్రస్తుత సంస్థాన్ నారాయణపురం మండలంలో ఒకప్పటి రాచకొండ ఉండేది. అలనాటి వైభవాన్ని చాటే కార్యక్రమాలతో ప్రజలకు మనకీర్తిని ఆవిష్కరింప చేయాలి.
-గుండమల్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపూర్
చెల్లింపుల్లో జాప్యం తగదు
వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఏఏ భూముల్లో ఏ పంటలు వేయాలి, సస్యరక్షణ, ఎరువులు, క్రిమిసంహారాల వాడకంపై చక్కటి సూచనలు ఇస్తున్నారు. అయితే పండిన పంటలను సిఎమ్‌ఆర్ కోసం ధాన్యం మిల్లులకు తరలించడం భేషుగ్గానే ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన చెల్లింపుల్లో జాప్యం జరగడం రైతులకు భారంగా మారుతోంది. ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి. అలాగే వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులు చాలాచోట్ల భర్తీకాలేదు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
నిజాలు తెలియాలి
ఎన్టీఆర్‌పై ఇద్దరు ప్రముఖ దర్శకులు వేర్వేరుగా చిత్రాలు తీయడంపై పాఠకురాలు ఎన్.రామలక్ష్మి రాసిన ఉత్తరంలోని అభ్యంతరాలు సరికాదు. వివాదాస్పద సంభాషణలు ఉంటాయని, ఎన్టీఆర్‌కు చెడ్డపేరు తేవద్దన్న సారాంశంతో ఆమె వ్యక్తం చేసిన విషయం సరికాదు. పురాణేతిహాసాలను తమకు నచ్చిన రీతిలో మార్చి పౌరాణిక పాత్రలలో నటించిన ఎన్టీఆర్‌పై ఎన్ని సినిమాలు వచ్చినా మంచిదే. ఆయా పురాణేతిహాసాలలోని అసలు నిజాలేమిటో వెల్లడి అయ్యే అవకాశం ఉంటుంది. రామారావు సినిమాల్లో కొన్ని అభ్యంతరకర సంభాషణలూ దొర్లాయి. అందువల్ల రాబోయే కొత్త సినిమాలవల్ల ఎన్టీఆర్‌కు ఏ చెడ్డపేరూ రాదు. వస్తే ప్రేక్షకులు తీర్పు చెబుతారు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్