ఉత్తరాయణం

జిఎస్‌టి పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తుసేవల పన్ను పరిధిలోకి పెట్రోలు, డీజిల్ తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిధిలోకి రానందువల్ల పన్నుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇది ప్రజలపై భారం పడటానికి కారణమైంది. ఒకవేళ వాటిని జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే ధరలు తగ్గి ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు లాభాలు తగ్గుతాయని లోపాయికారీగా వాటిని జిఎస్‌టి నుంచి తప్పించారా అన్నది సందేహంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గుతుందన్న కారణంగా పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి రాకుండా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుంది. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి. పెట్రో ధరల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురం
ఇదేమి లౌకికవాదం?
లౌకికవాదం అంటే ఇదేనా అంటూ ఇటీవల ముదిగొండ శివప్రసాద్‌గారు రాసిన వ్యాసం అక్షర లక్షలు చేసే పచ్చి వాస్తవాలకు అద్దంపట్టింది. ప్రపంచంలో మతాలవారీగా చాలా దేశాలు ఉన్నాయి. ఇస్లాం, క్రిస్టియానిటీ ఆలంబనగా ఎన్నో దేశాలున్న సంగతి అందరికీ తెలిసిందే. హిందువులకు అలా లేదు. మనదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ హిందూ దేశంగా చెప్పుకోలేదు. అలా చెప్పుకునే ధైర్యం కూడా చాలామందికి లేదు. హిందువులలో ఐక్యత లేకపోవడం, నాయకుల రాజకీయం ఇందుకు కారణం. మనదేశంలో భావస్వేచ్చ పెరిగిపోయింది. హిందు జీవన విధానాన్ని వ్యతిరేకించే వారిపై సత్వర చర్యలు తీసుకోవాలి. అలా ఎందుకు చేయలేకపోతున్నారు?
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
విదేశీ పెట్టుబడులతో ప్రమాదం
ఆహార శుద్ధి పరిశ్రమల రంగంలో తాజాగా యాభైవేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. మోదీ ప్రభుత్వం ఇలా వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి, అధికారంలోకి వచ్చిన తరువాత ఎఫ్‌డిఐకి గేట్లు బార్లా తెరిచింది. రోజువారీ చిల్లర వ్యాపారాలతో పొట్టపోసుకునే చిన్న వ్యాపారులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రాండెడ్ కంపెనీల గుప్పిట్లోకి వీరంతా చేరిపోవలసి వస్తుంది. ఇక ఆయా కంపెనీలు ఆహారంలో వాడే రసాయనాలతో రోగాలు తప్పవు. వాటిని ప్రశ్నించే శక్తి ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది. ఆయా సంస్థలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వారిపై ఎందుకు చర్య తీసుకుంటుంది. అందువల్ల ఆహార శుద్ధి రంగంలోకి, చిల్లరవ్యాపార రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అడ్డగోలుగా అనుమతించడం మానుకోవాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం