ఉత్తరాయణం

లోటుపాట్లు సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో దడ పుట్టించిన ప్రధాని మోదీ అభినందనీయుడు. ఎవరు ఎంత మంచిపని చేసినా కొన్ని లోటుపాట్లు తప్పవు. చేసిన మంచిపని కన్నా చిన్న చిన్న లోపాలపై దుమ్మెత్తిపోసేందుకు విపక్షాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దేవుడికే తప్ప- లోటుపాట్లు లేకపోవడం మానవులకు సాధ్యం కాదు. దేశంలోని అన్నివర్గాల ప్రజలూ మోదీ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. విపక్షాలు కూడా లోలోన మెచ్చుకుంటున్నా విమర్శలు చేయటం వారి బాధ్యత కాబట్టి చేస్తున్నారు. వీరు ఇలా విమర్శలు చేసే బదులు ప్రభుత్వానికి తగు సలహాలు ఇవ్వవచ్చు.
- పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి

అవినీతికి కళ్లెం ఎపుడు?
ప్రజలకు నిర్దిష్ట కాలవ్యవధిలో సేవలు అందేలా చూసేందుకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్‌ను అమలు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఎక్కడా ఇది అమలవుతున్న దాఖలాలు లేవు. అన్నిశాఖల్లో సిటిజన్ చార్టర్ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రజలలో అత్యధికులకు సిటిజన్ చార్టర్‌పై సరైన అవగాహన లేనందువల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. లంచాలు అడగకూడదు, ఇవ్వకూడదు లాంటి నినాదాలు ఉండాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో గుట్టుచప్పుడు కాకుండా లంచాల వేధింపులు షరామామూలుగానే ఉన్నాయి. అవినీతికి తావీయకుండా నిర్ణీత కాలవ్యవధిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

నల్లధనం నిర్మూలనకే..
పెద్దనోట్ల రద్దుతో బాధపడేది రియల్ ఎస్టేట్ రంగం, ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయవేత్తల్లో అవినీతిపరులు మాత్రమే. లక్షల కోట్ల నల్లధనం బడాబాబుల వద్ద మూలుగుతున్నందున దేశాభివృద్ధి కుంటుపడింది. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై చేసింది ఏమీలేదు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలే నల్లధనాన్ని ప్రోత్సహించాయన్నది వాస్తవం. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారంటూ నల్లధన నిర్మూలనను వ్యతిరేకించటం సరికాదు. నకిలీ కరెన్సీని తీవ్రవాదులు వాడుతున్నారు. దీన్ని అరికట్టాలంటే పెద్దనోట్ల రద్దు తప్పనిసరి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు మోదీ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో దేశ ప్రజలందరికీ తెలుసు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం

చిల్లర కష్టాలొచ్చాయ..
కరెన్సీ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలున్నాయి. అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, పాతనోట్ల మార్పిడికి గడువు విధించడం అభ్యంతరమే. కొత్తగా విడుదల చేసిన రెండు వేల నోటుకి చిల్లర దొరకడం లేదు. ఇది మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసినా చేయవచ్చు. పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల ముద్రణ వల్ల వ్యాపారాలు పడిపోయాయంటున్నారు. పరిశ్రమల మీద కూడా దెబ్బ పడిందంటున్నారు. నోట్ల రద్దుపై ఎవరికి అధికారం ఉంది? ప్రధానంగా ఇది ఆర్‌బిఐ పరిధిలోనిదని, ప్రభుత్వ వ్యవహారం కాదని సామాన్యుడి ఆలోచన. నల్లధనం వెలికితీతలో ఎప్పుడూ రాజకీయం రంగు వుండనే వుంటుంది. మన నేతలు రాజకీయంగా తలలు నెరసిన పండితులు కదా! నల్ల కుబేరుల జోలికి పోనే పోలేరు. సామాన్యుడు మాత్రం నోట్ల రద్దు వలలో పడ్డాడు.
-కె.వి.రమణమూర్తి, కాకినాడ