ఉత్తరాయణం

అవినీతి అంతస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ శివారు గ్రామాల్లో ‘జిప్లస్‌టూ’ అనగా మూడు అంతస్తుల భవన నిర్మాణాలకు పంచాయతీల నుండి అనుమతి తీసుకుని కొందరు బిల్డర్లు ఐదు, ఆరు అంతస్థుల్లో అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ అక్రమాలకు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు సహకరిస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాల పేరుతో కొందరు వ్యక్తులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. వివిధ స్థాయిల్లో అవినీతి కారణంగా గృహవసతి సమకూర్చుకోవాలనుకునే సామాన్యులు అంతులేని దోపిడీకి గురవుతున్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు సర్వే నెంబర్ల వారీగా చీలిపోయి అక్రమ వసూళ్లకు అలవాటు పడ్డాయి. జలమండలి నుంచి నీరు కొని ఇంటింటికీ అందిస్తామని వసూలు చేస్తున్న సొమ్ముతో రోడ్లు వేయిస్తున్నారు. జలమండలి నీరివ్వకపోతే వార్డు మెంబర్లే తమ వ్యవసాయ భూముల నుంచి టాంకర్ల ద్వారా ఇంటింటికీ నీటిని పంపుతున్నారు. పంచాయితీలను మున్సిపాలిటీలు కాకుండా స్థానిక నాయకులే కోర్టులకెక్కుతారు. ఈ అక్రమార్కులకు కళ్లెం వేసేదెవరు?
-విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్

తీరుమారని ద్రవిడ వర్సిటీ
కుప్పం లోని ద్రవిడ విశ్వవిద్యాలయం అవకతవకలపై విచారణకు కమిటీ వేసినా, ఎపి విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు పలుసార్లు హెచ్చరికలు చేసినా ఫలితం లేదు. క్యాంపస్ పిహెచ్‌డి స్కాలర్లు హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పులు తెప్పించుకున్నా చీమకుట్టని విధంగా ప్రవర్తించే వర్సిటీ అధికారులను ఇంకా ఎంతకాలం ఉపేక్షించాలి? వారి మీద చర్యలు ఎందుకు తీసుకోరు? రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు ఎందుకు వుంటోంది? సిఎంకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగని దుస్థితి కొనసాగుతోంది. పిహెచ్‌డి స్కాలర్లు ఇంకెవరికి మొరపెట్టుకోవాలి? డాక్టరేట్ డిగ్రీ కోసం ఎంతో కాలాన్ని, ధనాన్ని వెచ్చించిన స్కాలర్ల భవిష్యత్తు ఇప్పటికే తుంగలోకి తొక్కబడిందనే వాస్తవాన్ని పాలకులు గ్రహించారా? ఇకనైనా ద్రవిడ వర్సిటీ అక్రమాలపై విచారణ ముగించి, నిజమైన స్కాలర్లకు న్యాయం చేయాలి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

కల్తీపై సమరం ఎప్పుడు?
ఏ దినపత్రిక తిరగేసినా, ఏ టీవీ చానల్ తిప్పినా రోజుకో కల్తీవార్త మనల్ని కలవరపెడుతోంది. వంటనూనెలే కాదు, ఈమధ్య కొబ్బరినూనె, కారం, పసుపు వంటివి కల్తీ కావడం చూస్తున్నాం. నల్లధనంపై యుద్ధం చేసినట్లే కల్తీ ఆహార వస్తువులపైనా యుద్ధం ప్రకటించాలి. కల్తీ పదార్థాలను తినడం వల్ల పిల్లలు, వృద్ధులు ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. మార్కెట్‌కి వెళితే ఏది స్వచ్ఛమైన వస్తువో, ఏది కల్తీ వస్తువో తెలియక కొనుగోలుదారుడు అయోమయానికి గురవుతున్నాడు. కల్తీని నివారించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీపై ఆకస్మిక దాడులు నిర్వహించాలి. ఆహార పదార్థాలే కాకుండా శరీర లేపనాలు, సుగంధ ద్రవ్యాల వంటివి కూడా కల్తీ అవుతున్నాయి. అన్ని దుకాణాల్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువుకూ రశీదు ఇచ్చే నియమం పెట్టాలి. ప్రజలు కూడా ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలి.
- కొత్తపల్లి పోషన్న, ములుగు

ప్రలోభాలతో మతమార్పిడులు
దేశంలో హిందూ మతాన్ని నాశనం చెయ్యడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో మత మార్పిడులు జోరుగా సాగుతున్నాయి. పేద హిందువులను వివిధ రకాలుగా ప్రలోభపెడుతూ వారిని ఇతర మతాల్లోకి ఆకర్షిస్తున్నారు. హిందూ మతానికి చెందిన కొందరు డబ్బుకు ఆశపడి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు. తాము మతం మారడమే గాక, నలుగురికీ మతం మారమని ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద మత మార్పిడులు గుట్టుగా సాగుతున్నాయి. ఇందుకు ప్రేరేపిస్తున్న వారిపై నిఘా పెంచాలి. హిందూ మతాన్ని పరిరక్షించేందుకు ఇక ప్రభుత్వమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి.
- కె.వి.రమేష్, కంచరపాలెం