ఉత్తరాయణం

దేశభక్తి గేయాలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాల స్థాయిలో భాషా వాచక పుస్తకాలలో పాఠ్యాంశాలకు ముందు విధిగా కొన్ని దేశభక్తి గీతాలను ఇవ్వాలి. గతంలో పాఠ్యపుస్తకాలలో ప్రారంభంలో ‘సారే జహాసె అచ్ఛా’, ‘వందేమాతరం’ వంటి తదితర దేశభక్తి గీతాలు ఇచ్చేవారు. వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించేవారు. రానురాను వాటి ప్రాధాన్యతను తగ్గించారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా భాషావాచకాలలో విధిగా దేశభక్తి గీతాలను చేర్చాలి. వాటిని విద్యార్థులు నేర్చుకునేలా చేసి జాతీయ పర్వదినాల సందర్భంగా పాడించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

హోంగార్డుల వెతలు
హోంగార్డులు ఏళ్లతరబడి వెట్టిచాకిరీకి గురవుతున్నారు. చాలీచాలని దినసరి వేతనంతో వీరు కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు లేవు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. విధి నిర్వహణలో ఎంతగా కష్టపడుతున్నా వీరికి రక్షణలేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం హోంగార్డుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

ఆచరణ కష్టసాధ్యం
థియేటర్లలో సినిమా ప్రారంభానికిముందు జాతీయ పతాకం చూపిస్తూ జాతీయ గీతం రికార్డు వినిపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలనీ సుప్రీంకోర్టు ఆదేశించడం బాగుంది. కానీ ఇదెంతవరకు ఆచరణ సాధ్యం? మనవారిలో చాలామందికి అసలే దేశభక్తి తక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ. కొందరు నిలబడకపోవడం, నిలబడ్డవారు అటూఇటూ కదలడం, కబుర్లు చెప్పుకోవడం చేస్తారు. అలా చేయడం పతాకాన్ని, దేశాన్ని అవమానించడమే అని చాలామందికి తెలియదు. గతంలోనూ గీతాలాపన ఉండేది. కాని ప్రజల్లో శ్రద్ధలేక విరమించారు. ఇప్పుడూ అలాగే జరగొచ్చు. జాతీయ గీతం విన్నప్పుడు విధిగా గౌరవించాలన్న అంశంపై కుహనా లౌకిక వాదులు వితండ వాదనలకు దిగడం బాధాకరం.
- గిరిధర్, కాకినాడ

మద్య నిషేధం అవసరం
పెద్ద నోట్ల రద్దు కారణంగా చిల్లర నోట్లు లభించక మద్యం అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోయనటుల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయానికొచ్చాయట. మద్యం అమ్మకం తగ్గితే సమాజంతోపాటు ప్రభుత్వం సంతోషించాలి. సామాన్య, పేద ప్రజలు మద్యానికి బానిసలై కుటుంబాలను సర్వనాశనం చేసుకోవడం అందరికి తెలిసిన విషయమే. అందువల్ల ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో దశల వారీగా నిషేధించి ప్రజల ప్రాణాలు కాపాడాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హన్మకొండ