ఉత్తరాయణం

మైనారిటీలకు తాయిలాలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోంది. గతంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు కూడా ఈ ప్రభుత్వం అనేక తాయిలాలు ప్రకటించి అందజేసింది. ఇఫ్తార్ విందులకోసం నిధులు వెచ్చించింది. ప్రభుత్వానికి పెద్దమొత్తంలో హిందువులు చెల్లిస్తున్న పన్నుల నుంచి ఖర్చు చేస్తోంది. మెజారిటీ ప్రజలైన హిందువులకు రుచించని, ఆ వర్గానికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలుగానే భావించాలి. ప్రభుత్వ ఆదాయంలో 95 శాతం హిందువులు చెల్లిస్తున్నదే. మైనారిటీలకు ఇలా కోట్లాది రూపాయలు ధారపోయడంవల్ల ఇది లౌకిక ప్రభుత్వం అనిపించుకోదు. ఇది పూర్తిగా మతతత్వ ప్రభుత్వంగానే పరిగణించాల్సి వస్తుంది. ఇలాంటి చర్యల వల్ల హిందువులు తమకు అండగా నిలబడే, అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామనే బిజెపి వంటి పార్టీలకు తప్పనిసరిగా మద్దతు ఇచ్చేలా చేస్తాయి. మైనారిటీలను వెనకేసుకువచ్చే ప్రాంతీయ పార్టీలను అసలు తుడిచిపెట్టాలి.
టి.హెచ్.చౌదరి, సికింద్రాబాద్

ఎన్నికల సంస్కరణలు అవసరం
అపరిచిత విరాళాలను రాజకీయ పార్టీలు సేకరించకుండా నిషేధించాలని ప్రభుత్వానికి ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదన బాగుంది. ప్రస్తుతం అమలు జరుగుతున్న ఆ తరహా పాక్షిక నిషేధం 20వేల రూపాయలకు మించని విరాళాలపై వర్తించనందున ధనప్రవాహంపై ఏ ప్రభావమూ చూపలేకపోతోంది. ఎన్నికల సంఘం సూచన మేరకు పార్టీలు రెండువేల రూపాయలకు పైబడి పొందిన ప్రతి విరాళాన్ని, దానిని పొందిన మార్గాన్ని బహిర్గతపరిస్తే నల్లధనం సమస్య కొంతవరకు కట్టడి కాగలదు. 2014 ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల వ్యయం లక్షల కోట్లలో ఉంది. అందులో సింహభాగం నల్లధనమే. ఈసారి పార్లమెంటులో కొలువుదీరిన వాళ్లలో 30శాతం మందికి క్రిమినల్ రికార్డులున్నాయన్నా, అత్యథిక శాతం మంది కోట్లకు పడగలెత్తినవారన్నా, ఆ చేదు వాస్తవం తెలియజేసేది ఒక్కటే. రాజకీయాలు వ్యాపారమయ్యాయని, ప్రజలకు దూరమయ్యాయని. ఈ విపరిణామాలన్నీ సరిదిద్దాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గం.
డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

న్యాయ సంఘర్షణ సరికాదు
దేశంలో న్యాయ వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు నడుమ సంఘర్షణాత్మక వైఖరి కొనసాగడం దురదృష్టకరం. న్యాయవ్యవస్థ కొలీజియం ద్వారా తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని చూస్తుంటే ప్రభుత్వం కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయ నియామక పద్ధతులను ప్రతిపాదిస్తూ తనదే పైచేయి కావాలని భావిస్తోంది. రెండు వ్యవస్థలు ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటుండడంవలన దేశం ప్రతిష్ట మరింత మసకబారే ప్రమాదం వుంది. ఇప్పటికే దేశంలో లక్షలాది కేసులు పెండింగ్‌లో వున్నాయి. తీర్పులు చాలా ఆలస్యంగా వెలువడుతుండడంవలన అక్రమార్కులు తప్పించుకుంటున్నారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం