ఉత్తరాయణం

సకాలంలో పాఠ్య పుస్తకాలు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1నుండి 10 తరగతులకు ఈ విద్యాసంవత్సరం మార్చితో ముగుస్తుంది. 1నుండి 9 తరగతులకు మార్చి ప్రారంభంలో పరీక్షలు నిర్వహించి, మార్చిలోనే నూతన తరగతులకు ప్రమోషన్ కల్పిస్తారు. అయితే తరగతులు ప్రారంభమయ్యేనాటికే నూతన పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలి. 2016లో సకాలానికి నూతన పాఠ్యపుస్తకాలు రాక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈసారి అది పునరావృత్తం కాకుండా చూడాలి. అలా అయితే సిలబస్ సకాలానికి పూర్తవుతుంది. విద్యార్థులు ప్రిపరేషన్‌కు తగినంత వ్యవధి లభించినట్లవుతుంది.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

తీరని కరెన్సీ కష్టాలు
ప్రధానమంత్రి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని ప్రకటించి నెల దాటిపోయింది. కానీ సామాన్య ప్రజలకు కనీస అవసరాలకు కూడా నగదు లభ్యమవడంలేదు. వేతన జీవులు, విశ్రాంత ఉద్యోగులకు 10 వేలు ఇస్తామని ప్రకటించినా బ్యాంకుల్లో డబ్బులేనందువలన 4వేలు మాత్రమే ఇస్తున్నారు. ఏటిఎమ్‌లు పనిచేయడంలేదు. బ్యాంకుల్లో 2000కు పెద్ద క్యూలు ఉంటున్నాయి. బ్యాంకు ఉద్యోగుల కూడ శక్తికిమించి పనిచేస్తున్నారు. అసలు 2000 రూపాయల నోటు ఎందుకు ప్రవేశపెట్టారో అర్ధంకావడంలేదు. దీనికి చిల్లర దొరకడం అసాధ్యం అవుతున్నది. 50, 20, 100నోట్లు ఎక్కువగా ముద్రించి వుంటే పరిస్థితి ఇంత దిగజారి ఉండదు. మన ఎకౌంటులో ధనంవున్నా వినియోగంలోకి రావడం లేదు.
- కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్

‘ఎఫిషియన్సీ బార్’ విధానం అవసరం
కళాశాలలు, యూనివర్శిటీలలో రాగింగ్ చర్యలు అదుపులో లేవు. పరిమిత స్థాయిలో రాగింగ్‌కు లెక్చరర్లు, ప్రొఫెసర్లు అంగీకరించడమే అందుకు కారణం. ఇటీవల మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లక్ష్మి వేధించిన కారణంగా మెడికల్ పిజి స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. కొన్నినెలల కిందట నాగార్జున యూనివర్శిటీలోనూ అలాంటి సంఘటన జరిగింది. ఆయా సంఘటనలకు సంబంధించి కేసులు నడుస్తున్నాయి. ఇటువంటివాటికి విరుగుడుగా ‘ఎఫిషియన్సీ బార్’ విధానాన్ని మళ్లీ అమలు చేయాలి. 1960 వరకు ఆ విధానం అమలులో ఉండేది. కేసుల్లో ఇరుక్కున్నవారికి ‘ఇబి’ విధానంలో ఒక ఇంక్రిమెంట్ తగ్గించేవారు. ఇప్పుడు అలాకాకుండా ‘అసలు ఉద్యోగానికే ఎసరు వస్తుంది’ అన్న అర్థం వచ్చేట్టుగా ‘ఇబి’ని స్కేలులో ప్రతి మూడేళ్లకే అమలు అని పెడితే ఫలితం ఉటుంది. విద్యార్థులకైతే ప్రతి పై క్లాసుకూ ప్రమోషన్‌కు ముందే ‘ఇబి’ ఉండాలి. అంటే ఇంక వాడి లేక ఆమె చదువు అక్కడితో స్వస్తి. పోలీసు కేసు ఎలాగూ నడుస్తూనే ఉంటుంది. దీనిని ప్రభుత్వం ఆలోచించాలి. నిజానికి రాగింగ్ ఓ జాడ్యం. కొత్త విద్యార్థులకు బెరకు పోవడానికి ఉద్దేశించిన ఈ తంతు పక్కదారులు పట్టింది. విద్యాసంస్థల యాజమాన్యాలు, బోధనా సిబ్బంది విద్యార్థులు, వారి నాయకుల కదలికలను గమనిస్తూ కళ్లెం వేస్తే చాలావరకు అనర్థాలను అడ్డుకోవచ్చు. దారికి రానప్పుడు ఇలా ‘ఇబి’ విధానాలను ఆశ్రయిస్తే మేలు.
గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు