ఉత్తరాయణం

మతం పేరిట రిజర్వేషన్లా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల గూర్చి చర్చ జరుగుతోంది. ఇది అమలుకాదని ప్రస్తుత పాలకులకూ తెలుసు. కొందరిని రాజకీయ క్షేత్రంలో పలుచన చేయడానికి ఇది పాలకుల కుయుక్తి. సామజిక న్యాయంపై ప్రేమ వుంటే రాజకీయంగా పదవులు కేటాయించాలి. మత మార్పిడులు చేసుకున్న వారికి రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న హిందువులు పేదరికం కారణంగా రిజర్వేషన్ సౌకర్యం కోసం ముస్లింగా మారితే ఒక మతానికి లబ్ధిని చేకూర్చినట్లు కాదా? ఇలాంటి రిజర్వేషన్లతో అంబేద్కర్ మహదాశయం మంటగలుస్తుంది. అంటరానితనం దురాచార బాధితులు నిర్ణీత కాలంలో అభివృద్ధి చెందడానికే రాజ్యాంగం రిజర్వేషన్లను ప్రసాదించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలకు ఈ సౌకర్యాలు ఇవ్వాలను కోవడం సరికాదు.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్

హోదాకు తగునా?
తనను పార్లమెంటులో విపక్షాలు మాట్లాడనియ్యడం లేదని అందువల్లనే తాను బహిరంగ సభలలో మాట్లాడుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది నిజంగా విచారించాల్సిన విషయం. ఇదివరలో కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రధానమంత్రులెవరూ ఇటువంటి అభిప్రాయం ఎన్నడూ వెల్లడించలేదు. ప్రధానమంత్రి లోక్‌సభలో సభా నాయకుడు. మంత్రివర్గానికి మార్గదర్శి ఆయనే. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై మోదీ తన వాదనను వినిపించి ఉంటే సమావేశాలు రోజూ వాయిదా పడవలసిన అవసరం వుండేది కాదు. ప్రధాని ప్రకటన చేస్తానంటే సభాపతి ఆయనకే మొదటి అవకాశం ఇచ్చి వుండేవారు. విపక్షాలు అడ్డుకున్నాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగినట్లుగా లేదు.
- కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్

మానవత్వంతో ఆదుకోండి
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద నగదు ఉపసంహరణకు, నోట్ల మార్పిడికి క్యూలలో గంటల తరబడి ప్రాణాలు కోల్పోయిన వృద్ధుల కుటుంబాలకు కేంద్రం వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కారుణ్య దృష్టితో ఆలోచించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఏటా వడదెబ్బ మృతులకు, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలు కోల్పోయే వారి కుటుంబాలకు ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాయి. బ్యాంకుల వద్ద క్యూలలో నిల్చొని ప్రాణాలను కోల్పోయిన కుటుంబాల పట్ల ప్రభుత్వం మానవతా దృష్టితో వ్యవహరించడం కనీస నైతిక బాధ్యత. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే చరిత్ర క్షమించదు. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనల్లో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

యాజమాన్యం బాధ్యతే
ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు ముందు ‘జనగణమన’ వినిపించే సమయంలో ప్రేక్షకుల మధ్య జరిగిన ఘర్షణ పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్ళటం జాతీయ గీతానికి అవమానంగా భావించాలి. జాతీయగీతం వినిపిస్తున్న సమయంలో ప్రేక్షకులను కట్టడి చేయటం థియేటర్ల యాజమాన్యం బాధ్యత. వారు తగిన శ్రద్ధతీసుకోనందునే ఇలాంటి సంఘటనలు జరగటానికి అవకాశం వుంది. జాతీయగీతాన్ని సినిమా థియేటర్లకే పరిమితం కాకుండా, అధికారిక కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోను విధిగా పాడిస్తే ఉద్యోగులలో దేశభక్తి, సమైక్యభావం, క్రమశిక్షణ వంటివి అలవడతాయి. అప్పుడే జాతీయ గీతానికి నిజమైన గౌరవం, పరమార్థం లభిస్తుంది.
- ఉప్పు సత్యనారాయణ, తెనాలి