ఉత్తరాయణం

భక్తులా? దేశద్రోహులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షాత్తూ టి.టి.డి సభ్యుడైన ఓ ఘరానా వ్యక్తి వైష్ణవ నామాలను నుదుట అలంకరించుకుని మర్యాద ఉట్టిపడేలా వస్త్రాలంకరణ చేసుకుని- చివరికి వేలకోట్ల నల్లధనంతో, వందలాది కిలోల బంగారంతో ఐ.టి అధికారులకు దొరికిపోవడం విస్మయం కలిగిస్తోంది. భక్తుడి అవతారంలో కనిపించే ఆ పెద్దమనిషికి తమిళనాడులో ఉన్న అక్రమాస్తులు ఎన్నో ఇంకా లెక్కతేలలేదు. అక్రమ సంపాదన కూడబెట్టిన ఇలాంటి వారు భక్తులా? దేశద్రోహులా? ఈ అకృత్యాన్ని భరించలేక ఆ వెంకనే్న ఈ అక్రమ సంపాదనను బయట పడేశాడేమో. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నది సామాన్యులే గానీ ధనవంతులు కాదనేది వాస్తవం.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

‘బుల్లితెర’పై రక్తపాతం!
తెలుగు టీవీ సీరియళ్లలో ఈమధ్య హింస నానాటికీ శ్రుతి మించుతోంది. హత్యలు, రక్తపాతం, ఫ్యాక్షనిజం ఎక్కువైంది. భౌతిక హింసే కాదు, మానసిక హింసకు కూడా అంతే లేదు. కుట్రలు,కుతంత్రాలు,వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య, తల్లీకూతుళ్ల మధ్య మనస్పర్థలు, దుష్టశక్తులతో చేతులు కలిపి కుటుంబ సభ్యులపైనే కుట్రలు చేయడం, కక్షలు తీర్చుకోవడం మితిమీరుతోంది. టీవీ సీరియళ్లు చిన్నపిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతూ వారిలో నేరప్రవృత్తిని కలిగిస్తున్నాయి. బంధాలను పెంచేలా, మానసిక వికాసం కలిగించేలా సీరియళ్లు ఉండాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం (హైదరాబాద్)

మైనారిటీలకు తాయలాలు
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎపి సిఎం చంద్రబాబు ప్రకటించటం ఓటు బ్యాంకు రాజకీయం కాదా? కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇప్పటికే అమలులో ఉన్నాయ. ఇపుడు మైనారిటీ మతస్థుల ఓట్ల కోసం నేతలు తాయలాలు ప్రకటిస్తున్నారు. పేదరికంతో అలమటిస్తున్న మిగతా కులాల వారు ప్రజలు కాదా? వాళ్లకు రిజర్వేషన్లువద్దా? మతపరమైన రిజర్వేషన్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చాలామార్లు ప్రకటించింది. కుల, మత రాజకీయాలకు దూరంగా వుండే రాజకీయ పార్టీలే ప్రజలకు కావాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

‘తలాక్’లో తప్పేముంది?
‘తలాక్’పై అలహాబాద్ హైకోర్టు తీర్పు దురదృష్టకరం. ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మత విషయాల్లో ‘రాజ్యం’ యొక్క జోక్యాన్ని భారత రాజ్యాంగం నిషేధిస్తున్నది. న్యాయవ్యవస్థ కూడా రాజ్యంలో భాగమే. మతపరమైన ఆచారాలపై వ్యాఖ్యలు చేస్తూ మత విశ్వాసాలు, నియమాలకు కోర్టు సవరణలు ప్రతిపాదించడం సరి కాదు. ముస్లిం మహిళలకు ‘తలాక్’ చెప్పి వారి భర్తలు విడాకులివ్వడం మతానికి సంబంధించినది. ‘తలాక్’ దురాచారమా? కాదా? అన్నది తేల్చాల్సింది రాజ్యం కాదు, ముస్లింలే దాన్ని నిర్ణయించాలి. అది ఆ మతస్తుల ఆంతరంగిక విషయం. అయినా, ‘తలాక్’ ఎలా దురాచారమైంది? ఇష్టం లేని జీవిత భాగస్వామితో విడాకులను ఆధునిక ప్రజాస్వామ్యం ప్రతిపాదిస్తున్నది. అది ఏ విధంగా జరిగితేమి? జరగవలసిందే కదా? ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, పెద్ద మనుషుల జేబులు తడిపి విడాకులు తీసుకోవడం సదాచారమా? ముస్లింలలో నిఖా (వివాహం) ముందు వరుడు ‘మెహర్’కు అంగీకరించాలన్న నిబంధన ఉంది. ఒకవేళ భర్త భార్యను వదిలిపెట్టే పక్షంలో ఇవ్వవలసిన పరిహార ద్రవ్యమే ‘మెహర్’. భర్త ‘తలాక్’ చెప్పినపుడు భార్యకు ఆ మొత్తాన్ని ముట్టచెప్పవలసి వుంటుంది. ‘తలాక్’ దురాచారమని అనుకున్నా, ఎంతమంది భర్తలు తమ భార్యలకు తలాక్ చెబుతున్నారు? ఇలాంటి లెక్కలేమైనా సదరు న్యాయమూర్తుల దగ్గర ఉన్నాయా? ‘స్ర్తి పక్షపాతం’ అనేది నేడు ఒక ఫ్యాషన్, మగతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఇది ఒక మార్గం అయింది. ఈ ధోరణి ఇపుడు కోర్టులకు కూడా పాకడం దురదృష్టకరం.
-డి.మోహనశర్మ, కుక్కడం (సూర్యాపేట జిల్లా)