ఉత్తరాయణం

రోడ్డుపక్క మద్యం షాపులొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడం హర్షణీయం. దీన్ని వెంటనే తప్పనిసరిగా అమలుచేయాలి. జాతీయ రహదారుల పక్కనేగాదు గ్రామీణ రహదారులపై కూడా మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించాలి. నిత్యం మద్యం మత్తులో వాహనాలు నడిపేవారు లెక్కలేనంతమంది. తత్ఫలితంగా తరచూ రోడ్డుప్రమాదాలు జరిగి ఎంతోమంది మరణిస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ను అరికట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని అన్ని రహదారులపైనా మద్యం దుకాణాలను తొలగించాలి. ఎవరైనా నిషేధాన్ని ధిక్కరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ప్రైవేటు వర్సిటీలు ఎందుకు?
ప్రస్తుతం ప్రభుత్వ అజమాయిషీలోని యూనివర్సిటీల్లో సైతం కొన్ని కోర్సుల పట్ల విద్యార్థులు విముఖత చూపుతున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చిన కళాశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. కొన్ని కోర్సులకే డిమాండ్ ఉంది. లెక్కకు మించి ప్రైవేటు రంగంలో ఇంజనీరింగ్, బిఎడ్, ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ కళాశాలలకు అనుమతులిచ్చారు. విద్యార్థులు లేక ఇప్పటికే చాలా కళాశాలలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యను ప్రవేటీకరించేందుకు ఉరకలు వేస్తోంది. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరతను తీర్చి, తగినన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రైవేటు వర్సిటీలకు అనుమతులివ్వాలన్న ఆలోచనకు స్వస్తి పలకాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

గోవధపై గొంతు విప్పరా?
తమిళులంత ఒక్కటయ్యి పట్టారు ఉడుం పట్టు
పెటాపెటామంటూ పెట్టిందీ యెద్దాటకు అడ్డుకట్టు
సుప్రీం కోర్టు విసిరె కళ్ళెం ఎద్దులన్నీ ఆగేట్టు
ప్రపంచాన తమిళులందరి మనస్సులు కదిలేట్టు
‘పెటా’కెందుకండి పశువులపై జాలి కలిగినట్టు?
గోవధలెన్నవుతున్నా నోరు మెదపరెందుకన్నట్టు?
గోహత్యల నిర్మూలనకు సుప్రీం ఏం చేసినట్టు?
సంప్రదాయ పండుగలపై నిషేధాలు చిచ్చు పెట్టు
ఎందుకింత మొండి పట్టు? సై కొట్టండి జల్లికట్టు జరిగేట్టు.
- చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు