ఉత్తరాయణం

రైల్వే జోన్‌పై తాత్సారం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ ప్రాంతీయులు చిరకాలంగా కోరుతున్న ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇకనైనా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో ఉన్న విశాఖపై రైల్వే అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ వస్తుందని కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రకటించినా ఆ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. సరైన బుకింగ్ సదుపాయం, తగినన్ని రైల్వే లైన్లు లేనందున చెన్నై, కేరళ ప్రాంతాల రైళ్లు విజయనగరం మీదుగా రాయ్‌పూర్, బిలాస్‌పూర్, బరంపురం, కటక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ మీదుగా హౌరాకు వెళ్తున్నాయి. విశాఖ ప్రాంతంలో రైల్వే శాఖకు తగినంత ఆదాయం ఉన్నా తగినన్ని రైళ్లు లేక ప్రయాణీకులు నానాపాట్లు పడుతున్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పడితే కాకినాడ పోర్టు- విజయవాడ మధ్య పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌తో కలిపి రైల్వే పద్దులను సమర్పించారు. అయితే, రైల్వే జోన్ గురించి ప్రస్తావించకపోవడం దారుణం. ఇకనైనా ఆలస్యం చేయకుండా విశాఖలో రైల్వే జోన్ ప్రారంభించాలి.
- జె.సుధాకరరావు, కాకినాడ

హిందువుల్లో అనైక్యత
శివలింగాన్ని మద్యం, సిగరెట్లతో అభిషేకిస్తున్నట్టు ఓ సన్నివేశాన్ని చిత్రీకరించి ‘యూ ట్యూబ్’లో పెట్టిన ఒకానొక సినిమా దర్శకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమ దేవుళ్లను ఇలా అవమానించినందుకు ఓ హిందూ సంఘానికి చెందినవారు ఆందోళన చేస్తే తప్ప పోలీసులు స్పందించలేదు. ఇటీవల ఓ ప్రముఖ ప్రవచనకర్త నోరు జారి ఒక మాట అన్నందుకు ఓ కులసంఘం వారు రోడ్డెక్కారు. కానీ- టీవీ చానళ్లలో, ఇతర మతాల ప్రచార సభల్లో హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడినా ఈ కులసంఘాలు ఎందుకు స్పందించవు? హిందువులైనప్పటికీ కొన్ని కులసంఘాల వారు అనవసర రాద్ధాంతాలకు దిగుతున్నారు. అన్యమతస్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ కులసంఘాలు ఎందుకు అడ్డుకోవు. కులాల పేరిట చీలిపోవడం వల్లే హిందువుల్లో అనైక్యత ఏర్పడింది. దీంతో అన్యమతాల వారు హిందూ దేవుళ్లని కించపరుస్తున్నారు. - జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్

‘గ్రాఫ్స్’ కన్నా ‘గ్రాఫిక్స్’ ఎక్కువ!
సినిమాలో వయసు మళ్లిన హీరో ఒక అడుగు ముందుకేస్తే ‘గ్రాఫిక్స్ మా యాజాలం’తో వందమైళ్లు పరిగెత్తినట్టు చూపిస్తారు. ఈసారి కేంద్ర బడ్జెట్ ఇలాగే ఉంది. అసలు విషయం కన్నా ఆశల్ని, ఆకాంక్షల్ని కనికట్టుగా కళ్లముందు నిలిపింది. బడ్జెట్ ద్వారా ప్రభుత్వానికి కొత్తగా వచ్చే మైలేజీ ఏమీ లేదు. జనం కూడా మంచి రోజుల కోసం నిరీక్షిస్తుంటారు. ఆర్థికమంత్రి జైట్లీ అంతా రంగుల్లో చూపించారే తప్ప ప్రత్యేకంగా ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లభించేలా చొరవ చూపలేదు. పెద్దనోట్లు రద్దయ్యాక ఎంతో సహనం చూపిన పేద, మధ్యతరగతి వారికి బడ్జెట్‌లో దక్కిందేమీ లేదు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో మార్పులు దాదాపు శూన్యం. వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రాంతానికి పొగడ్తలు, హామీలే మిగిలాయి. బలమైన చేయూతనిచ్చేలా నిధుల కేటాయింపులు కనబడలేదు. ఆర్థిక నేరాల నియంత్రణకు, ఎన్నికల సంస్కరణకు రావల్సిన చట్టాల గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రసంగించి ఏం లాభం? హామీలు, చట్టాలు అమలుకు నోచుకోవు. పేదల బతుకుల్లోనూ పెద్దగా మార్పు ఉండదు. నగదు రహిత లావాదేవీల తరహాలో ఇది ‘వాస్తవ గణంకాల రహిత’ బడ్జెట్. డిజిటల్ ఎకానమీకి సరిపోయే- ‘గ్రాఫ్స్’ లేని గ్రాఫిక్స్ బడ్జెట్.
-డా. జివిజి శంకరరావు, పార్వతీపురం