ఉత్తరాయణం

ట్రంప్ చేష్టలకు కంపిస్తున్న ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టి పట్టుమని పది రోజులైనా కాలేదు. ఆయన చెలరేగి నృత్యం చేస్తున్న రీతిలో ఎడాపెడా జారీచేస్తున్న అధికారిక ఆదేశాలతో అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ కంపిస్తున్నాయి. ఇతర దేశాలతో ఉన్న సంబంధాల్ని సమూలంగా మార్చివేసే తన సొంత బాణీ రాజనీతిని అమలుపర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు లాభం కన్నా ఎక్కువ నష్టానే్న కలగజేసేవిగా ఉన్నాయి. అమెరికాకు ఏ పూర్వ రాజకీయ అనుభవమూ లేదా సైనిక బాధ్యతలు చేపట్టిన అనుభవమూ లేని మొదటి అధ్యక్షుడాయన. అయితేనేం.. వ్యాపారవేత్తగా ఎన్నో ఆకాశ హర్మ్యాలు కట్టిన అనుభవముంది. ఆ కారణంగానే కావొచ్చు. మెక్సికో సరిహద్దు వెంబడి మూడువేల కిలోమీటర్ల పొడవునా గోడ కట్టడానికి పూనుకొన్నాడు. అయితే అది ప్రభుత్వ ఖజానా నుండే లెండి. ఇక ఏడు ముస్లిం ప్రాబల్యం ఉన్న దేశాల నుండి ఎవ్వరూ అధికార వీసాలున్నా సరే అమెరికాలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఉత్తర్వులిచ్చాడు. తీవ్రవాదంపై లక్షిత యుద్ధం చెయ్యడానికి బదులుగా దేశాలపై చీకటి యుద్ధానికి పూనుకోవడం హాస్యాస్పదమే కాదు, ప్రమాదకరం కూడా. వలసదారులపై తీవ్ర ఆంక్షల్ని విధిస్తున్నాడు. వివిధ దేశాల నుండి మేధోవలసలతో ఎంతో లాభపడిన దేశం, ఒక్క కలం పోటుతో వారిపై తీవ్ర చర్యలకు పాల్పడడం వైపరీత్యం. హద్దులేనితనంతో మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టకుండా అధ్యక్షుడిని అదుపుచెయ్యగల శక్తి, ఆయనకు ఓటేసి గెలిపించిన అమెరికా పౌర సమాజానికే ఉంది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

పార్ట్‌టైం వర్కర్లను ఆదుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రంథాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం వర్కర్లను రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. గ్రంథాలయ శాఖలో చాలాకాలంగా ఖాళీ పోస్టులను భర్తీచేయడం లేదు. ఒక లైబ్రేరియన్ రెండు గ్రంథాలయాల విధులు నిర్వహించవలసి వస్తుంది. చాలీచాలని జీతంతో బతుకులు వెళ్లదీస్తున్న వీరిని ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ చేయాలి. వీరంతా ఏళ్ల తరబడి గ్రంథాలయాలను నమ్ముకొని పనిచేస్తున్నారు. జీవన వ్యయం పెరుగుతున్న దృష్ట్యా వీరిని రెగ్యులర్ చేసి ఆదుకోవాలి. ప్రభుత్వం కనీసం వీరికి జీతం పెంచైనా ఆదుకొంటే సరే, లేకుంటే వీరు దుర్భరంగా గడపవలసి వస్తుంది. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తే వీరు పాఠకులకు మరింతగా సేవచేయగలరు. ప్రభుత్వం వీరి బాధలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.
- యం.్భస్కర్, గాంధారి

ఏపి నేతలకు కనువిప్పు కలగాలి
తమిళ ప్రజలను, అక్కడి ముఖ్యమంత్రిని చూసి ఆంధ్ర రాజకీయ నాయకులు పాఠాలు నేర్చుకోవాలి. జల్లికట్టు క్రీడను నిషేధిస్తే తమిళ ప్రజలు, నాయకులు ఉప్పెనలా ఎదిరించారు. జల్లికట్టు ప్రమాదకరమైనదే అయినా ప్రజల నిరసనలను అర్థం చేసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్లి ప్రధానమంత్రితో చర్చించి ఒక్కరోజులోనే ఆర్డినెన్స్ జారీ చేయించారు. ఏపి ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రిని కలిసి ఒప్పించాలి. విశాఖకు రైల్వేజోన్, ప్రత్యేక హోదా, కడప జిల్లాలో స్టీలుప్లాంటు మొదలైన డిమాండ్లపై కేంద్రం స్పందించనందుకు ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. నిరసన తెల్పినవారిని ఏపి సర్కారు అరెస్టు చేయిస్తుండడం విచారకరం. తమిళుల పోరాట పటిమను చూసైనా ఆంధ్ర రాజకీయ నాయకులు తమ రాష్ట్రానికి కావలసిన పథకాల కోసం ప్రతిపక్షాలతో కలిసి పోరాడి అవసరమైన ప్రత్యేక ఆర్డినెన్స్ తెప్పించాలి.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు

ఆరోగ్యానికి కల్తీకాటు
నిత్యావసర సరకుల్లో కల్తీ యథేచ్ఛగా సాగుతున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. ఖమ్మంలో ఇటీవల భారీ ఎత్తున కల్తీ కారం పట్టుబడడం ఇందుకు నిదర్శనం. నిత్యం వంటల్లో వాడే జీలకర్ర, ధనియాలు, పసుపు, ఇతర మసాలా దినుసులు కల్తీ అవుతున్నాయి. వీటిని వాడే వారు అనారోగ్యం పాలవుతున్నారు. పాలు, వంటనూనెలు, నెయ్యి వంటివి కల్తీ అవుతున్నాయి. కల్తీ నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు, అధికారులు భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు.
- అయినం రఘురామారావు, ఖమ్మం