ఉత్తరాయణం

సభలు సజావుగా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలి. తమ ఆకాంక్షలు, సమస్యలను దృష్టిలో వుంచుకొని పార్లమెంట్‌లో అనేక అంశాలను చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపర్చాలని దేశ ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక విషయంపై ఎప్పటిలాగే తమ వాదనే గెలవాలని రభస చేస్తూ సభలను వాయిదా వేయడం మంచిది కాదు. సమావేశాలు సజావుగా జరిగేలా విపక్ష, అధికారపక్ష ఎంపీలు బాధ్యత వహించాలి. ఇప్పటికే సభలు జరుగుతున్న తీరును, సమావేశాలకు కోట్లాది రూపాయల ఖర్చును చూసి ప్రజాస్వామ్యంపై జనాలకు నమ్మకం పోతున్నది. ప్రజల మనోభావాలను గమనించైనా సభలను విజయవంతంగా నడిపించేందుకు ఎంపీలంతా తోడ్పడాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, సికిందరాబాద్

ప్రచారం కోసం ఆందోళనలా?
ఏపికి ప్రత్యేక హోదా అడగడం పాపం కాదు. అయితే, ఇందుకోసం చేసే ఆందోళనలకు సమయం, సందర్భం ఉండాలి. దేశం అంతా రిపబ్లిక్ ఉత్సవాలు చేసుకుంటున్నప్పడు, ఉగ్రవాద ముప్పు వల్ల భద్రతాదళాలు అప్రమత్తంగా ఉన్న వేళ- పాదయాత్ర అంటూ ఒకరు, వౌన పోరాటం అంటూ ఇంకొకరు ఆందోళనలు లేవదీయడం విజ్ఞతా? ఈ నేతలకు బాధ్యత, విజ్ఞత వుంటే ప్రత్యేక హోదా వల్ల లాభాలేంటి? కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ వల్ల నష్టం ఏమిటి? అన్న విషయాలను ప్రజలకు చెప్పాలి. హోదా కోసం రాజ్యాంగాన్ని సవరించవలసి ఉంటే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వల్ల అది సాధ్యమవుతుందా? ఇలాంటి విషయాలన్నీ చర్చించాలి. అదేమీలేకుండా హోదా.. హోదా అంటూ రోడ్లమీద ఆందోళనలు చేయడం వల్ల కొందరి పేర్లు రోజూ ప్రచారం అవడం తప్ప ఉపయోగం లేదు.
- గిరిధర్, కాకినాడ

అనవసర రాద్ధాంతం
అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ని విమర్శిస్తూ ఆందోళనలు నిర్వహించే ఒక వర్గం తయారైంది. తాజాగా ట్రంప్ ట్విట్టర్ ఖాతాలో ‘ఆనర్’, ‘ఆనర్డ్’ అనే పదాలను స్పెల్లింగ్ తప్పుగా ఉండటం ఘోర అపరాధం అని కొందరు విమర్శిస్తున్నారు. ఆంగ్లమే అయినా కొన్ని పదాలను ఇంగ్లాండ్‌లో ఒకలా, అమెరికాలో మరోలా రాస్తారు. కలర్ అనే మాటలో అమెరికన్లు ‘యు’ అనే అక్షరం రాయరు. ఆనర్, ఆనర్డ్ పదాల్లో ‘యు’ రాయలేదు ట్రంప్. అదో వివాదం అయింది. ఇంత చిన్నదానికి ట్రంప్‌ని నిందించనేల?
- ప్రసన్న, పేర్రాజుపేట

అభివృద్ధిలో వివక్ష వద్దు
ఏపిలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్థి పథకాలను సమానంగా అమలు చేయాలి. చిరకాలంగా వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కొన్ని జిల్లాల్లో వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి. గిట్టుబాటు ధర లభించక రైతులు కూరగాయలు, ధాన్యం తక్కువ ధరలకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. ప్రభుత్వమే పంటల ఉత్పత్తులను కొని, రైతుకు నష్టం రాకుండా చూడాలి. విద్యుత్ చార్జీలను పెంచే యోచనను మానుకోవాలి. రాయలసీమలో చేపట్టిన వివిధ సాగునీటి పథకాలను పూర్తిచేయడానికి శ్రద్ధచూపాలి. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును నెలకొల్పాలి. ఒకే చోట నిధులన్నీ ఖర్చు చేస్తే అభివృద్ధి సమానంగా జరుగదు. కొత్త పరిశ్రమలు, వైద్యశాలలు, విద్యాసంస్థలను రాయలసీమ, ఉత్తరాంధ్రలో నెలకొల్పాలి.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు