ఉత్తరాయణం

ప్రాంతీయ పార్టీలదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ పార్టీల మనుగడ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన దుస్థితి ప్రస్తుతం దేశంలో ఏర్పడింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సొంతంగా గెలిచే సత్తా లేక యుపిలో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ వారు పొత్తు కుదుర్చుకున్నారు. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చివరికి సమాజ్‌వాదీతో బేరసారాలు చేసుకుని కొన్ని సీట్లకు పోటీ చేస్తోంది. యుపిలో తమ పార్టీ సిఎం అభ్యర్థి షీలా దీక్షిత్ అని గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ నేతలు మాటమార్చి, సమాజ్‌వాదీ ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకోక తప్పలేదు. ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినప్పటికీ కాంగ్రెస్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక, జాతీయ పార్టీ అయిన బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడలేక పోతోంది. కాశ్మీర్, మహారాష్టల్ల్రో ఇతరులతో కలిసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది. తెలంగాణ, ఏపిలో టిడిపితో బిజెపి జత కట్టింది. తమిళనాట బిజెపికి బోణీ లేదు. సిపిఐ, సిపిఎంలు కూడా క్రమంగా మనుగడ కోల్పోతున్నాయి. సొంతంగా పోటీ చేసినా, ‘ఫ్రంట్’ల పేరిట బరిలోకి దిగినా వామపక్ష పార్టీలకు సీట్లు పెరగడం లేదు. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరగడంతో రాష్ట్రాల మధ్య తగాదాలు ఏర్పడుతున్నాయి. సమైక్యతా భావం దెబ్బతింటోంది. జాతీయ పార్టీలు బలపడితే తప్ప ప్రాంతీయ వాద ఉద్యమాలకు తెరపడే అవకాశం లేదు.
- ఎఆర్‌ఆర్‌ఆర్ గౌడ్, ఖమ్మం

పన్నీరు సెల్వం - కన్నీరు పర్వం
కన్నీరు మున్నీరై కాల్వ కట్టింది, వాల్వులన్నీ ఒక్కసారిగా ఓపెన్ అయినట్టు పన్నీరు సెల్వం చెంపల మీద.. ఎంత కష్టం.. అమ్మపోయిన దుఃఖంలో ఉండగానే రాజ్యపాలన చేతికొచ్చింది. అమ్మకన్నా మిన్నగా చిన్నమ్మ తన వెన్ను తట్టి వెన్నంటే ఉంటుందని ఆశపడ్డాడు. తన కన్నుల్లో పెట్టుకొని చూసుకుంటుందని భావించాడు. వెనక నిలిచి వెన్నుదన్నుగా వెనె్నల కురిపిస్తుందని అనుకొన్నాడు. తల్లిలా భావిస్తే సవతి తల్లిగా మారింది. గుండమ్మ కథ సినిమాలో సవతితల్లి చేతిలో సావిత్రిలా కష్టాలు పడుతున్నాడు, పాపం.. చిన్నమ్మ ఉన్నపళంగా రూటు మార్చింది. తనతో పెన్ను పట్టించి రాజీనామా రాయించింది. ఈ వెన్నుపోటు గురించి అమ్మ ఆత్మకు విన్నవిద్దామని ధ్యానం చేసినా ఫలితం సున్నా. అందుకనే ప్రజల్ని కోరుతున్నాడు. మీరు ఔనంటే రాజీనామా తూచ్ అంటానని. పాపం ప్రజలు.. వారేం చెప్తారు? పీఠం వారిదే అంటారు గానీ ఓటు తీసుకున్నాక మాటవరసకైనా వారికి ఏమైనా చెప్పే సంప్రదాయం మన పార్టీలకుందా? అమ్మ అనారోగ్యమైనా, అధికార మార్పిడైనా వారికి ఆరు మాసాల పిమ్మటేగా తెలిసేది. ఇలా చేతులు కాలినపుడే వారు గుర్తుకువచ్చేది. అయినా ఇప్పుడు రాజీనామా వెనక్కి తీసుకోవాల్సిన అవసరమేముంది? ఎలాగూ ఆయనే కదా- ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. పైనున్నోడి దయ ఉండాగాలేగానీ ఆయన ఎన్నాళ్లయినా నెట్టేయచ్చు ఇలాగే. ఎద్దును లొంగదీసే జల్లికట్టు కోసం కాదు ప్రజలు ఉద్యమించాల్సింది. తమ ప్రమేయం లేకుండా రంకెవేస్తున్న దొంగ రాజకీయాల్ని ముకుతాడు వేసేలా ఉద్యమించాలి. నిజమైన ప్రజాపాలన కోసం ఉద్యమించాలి.
-డా డి.వి.శంకరరావు, పార్వతీపురం

హిందూ మతంపై విద్వేష ప్రచారం
విదేశాల నుండి విరాళాలను అందుకుంటూ, పారదర్శకత లేకుండా కార్యకలాపాలను సాగిస్తూ, ఆర్థిక నిబంధనలను తుంగలో తొక్కిన ఆరువేల స్వచ్ఛంద సంస్థలను నిషేధించాలని కేంద్రం నిర్ణయించడం ముదావహం. ఇందులో సింహభాగం సంస్థలు హిందూత్వంపై దాడి చేయడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున విదేశీ నిధులు సేకరించి హిందూ మతంపై ఒక పద్ధతి ప్రకారం విద్వేష ప్రచారం సాగించడం, రోగాలతో బాధపడేవారు, పేదరికంలో మగ్గేవారి బలహీనతలను ఆధారం చేసుకొని తమ మతంలోనికి వస్తే అన్ని బాధలు తొలగుతాయన్న అసత్యపు ప్రచారాలతో పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడుతున్నారు. సభలతో సరిపెట్టక టీవీ చానెల్స్ స్థాపించి 24 గంటలు హిందూ మతాన్ని తిట్టడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న ఈ కుహనా స్వచ్ఛంద సంస్థలపై క్రమశిక్షణా చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడడం సముచితం. కళాశాలల్లో ప్రేమ పేరుతో అన్యమతస్థుల మధ్య ప్రేమ వివాహాలు జరిపించడం దారుణం.
- ఎం.కనకదుర్గ, తెనాలి