ఉత్తరాయణం

తెలుగును నిరాదరించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎన్నో భాషలు, సంస్కృతులు ఉన్నాయి. ఎవరి భాషా సంస్కృతులపై వారికి అభిమానం ఉంటుం ది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్ర జలకు తమ మాతృభాష పట్ల ఉన్న చులకన భావం, నిరాదరణ మరే భాషీయులలోనూ కనిపించదంటే అతిశయోక్తికాదు. ఆంగ్లం, హిందీ వంటి ఎన్ని భాషలైనా నేర్వవ చ్చు. వాటి మోజులో పడి తెలుగును నిరాదరించడం మాత్రం తగదు. తెలుగేతర భాష మాత్రమే తెలిసిన వారితో ఆయా భాషల్లో మాట్లాడక తప్పదు. తెలుగువారే తెలుగులో కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుకోవడం కృ తకంగా ఉంటుంది. ఇకనైనా తెలుగు వారు తమ మాతృభాషపై ప్రేమను పెంచుకోవాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్

మంచి సీరియల్స్ రావాలి
ఉద్యోగులు, వ్యాపారస్థులు తదితరులు తమ శ్రమను మరచిపోయి రిలాక్స్ అవడానికి టి.వి. సీరియల్సో మరేవైనా కార్యక్రమాలో చూస్తారు. అటువంటి టి.వి. డైలీ సీరియల్స్ కుటుంబ సంబంధాలను, మానవ సంబంధాలను కలిపే విధంగా, నైతిక విలువలు పెంచేవిగా, మూఢ నమ్మకాలను వదిలించేవిగా, సమాజాన్ని జాగృతం చేసేవిగా ఉండాలి. కాని రక్తసంబంధీకుల పట్లనే కుట్రలు కుతంత్రాలు, విషప్రయోగాలు, ఫ్యాక్షన్ మర్డర్లు, మానవ సంబంధాలను దెబ్బతీయడం వంటివి నింపి వందలు వేల ఎపిసోడ్లే లక్ష్యంగా సమాజాన్ని పెడద్రోవ పట్టించ డం సమంజసమేనా? ఇలాంటి అర్థంలేని డైలీ సీరియళ్ళను ఆపేసి సమాజాన్ని మంచి దారిలో పెట్టే కథలతో, పరిమిత ఎపిసోడ్‌ల డైలీ సీరియల్స్ రావాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

కులవృత్తులకు ఆదరణ కరవు
కుల వృత్తులకు ఆదరణ పూర్తిగా లేదు. పల్లెల్లో పాత చీరలతో బొంతలు కుట్టేవారి పరిస్థితి చాలా దయనీయం గా ఉంది. అభివృద్ధి చెందిన కంప్యూటర్ యుగంలో బొం తలు కుట్టే వారికి ఆదరణ కరవైంది. వీరు కుట్టే వస్తువులు మంచి మన్నికతో వున్నప్పటికి, వీరిని ఎవరు కూడా ఆదరించడం లేదు. వీరిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి. వీరికి బ్యాంకులు కొంతమేర ఋణాలు యిస్తే వీరు తమ సామాగ్రిని ఎక్కువగా పెంచుకొని, మంచి మన్నికగల వస్తువులను ఉత్పత్తిచేస్తారు. చేతితో వీరు తయారుచేసే వస్తువులకు మన్నిక బావుంటుంది. పురాతన కాలంనుంచి బొంతలు కుడుతున్న వారిని ఆదరించాలి. తరతరాలుగా నమ్ముకున్న కులవృత్తికి ఆదరణ లేకపోవడం విచారకరం.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్

కొద్దిగా ఓపిక పట్టాలి
కేంద్రం 29 రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇవ్వాల్సి వుంటుంది. ఎన్ని నిధులు యిచ్చినా నామమాత్రంగానే అగుపడతాయి. కారణం 29 రాష్ట్రాలకు న్యాయం చేయాలి కదా! రాష్ట్రం విడిపోతే అనేక ఇబ్బందులు వస్తాయని 5వ తరగతి పిల్లవానికి కూడా తెలుసు. అయినా లోలోపల అందరూ లేఖలు యిచ్చారు. రోమ్ నగరం ఒక రోజులో కట్టలేదు కదా? కొద్దిగా ఓపిక పట్టాలి. ఇచ్చిన నిధుల్లో ఎంతవరకు రాయలసీమకు ఖర్చుచేశారు. ఆనాటి నుండి రాయలసీమ వెనుకబడుతూనే వుంది.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు

పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి
ఎన్నికల్లో గెలిచిన వారు ఏ పార్టీ వారైనా సరే పార్టీకి రాజీనామాతోపాటు పదవికి కూడా రాజీనామా చేయాలి. కాని ఎన్నికల్లో గెలిచిన వారిలో కొందరు పార్టీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేయడం లేదు. ఇది చట్టానికి విరుద్ధం. చట్టప్రకారం అయితే పార్టీకి పదవికి రాజీనామా చేయాలి. ఆవిధంగా చేసిన తర్వాత ఎన్నికల్లో కొత్తగా చేరిన పార్టీ తరపున నిలబడి గెలవాలి. అప్పుడే పార్టీ మారడానికి చట్టబద్ధత లభిస్తుంది. అందువల్ల పార్టీ మారితే పార్టీతోపాటు పదవికి కూడా రాజీనామా చేయిం చి ఎన్నిక లు జరపాలని మా కోరిక.
- ఎం.రాజు, తాడిపత్రి

సామాన్యునికే చట్టాలు
సామాన్యుడు నేరం చేస్తే వెంటనే జైలుపాలు. ఎఫ్‌ఐఆర్ దాఖలు. కాని హిమాచల్ సిఎం మీద అక్రమాస్తుల ఆరోపణ వస్తే ఆ రాష్ట్ర హైకోర్టు అతనిని అరెస్ట్ చేయడం గాని, ప్రశ్నించడం గాని, ఛార్జిషీటు దాఖలు చేయడం గాని చేయరాదని సిబిఐని ఆదేశించింది! కోర్టులు ఇలా కూడా ఆదేశిస్తాయా అని మన మట్టిబుర్రలు ఆశ్చర్యపోతాయి గాని కేసు వాదించినవాడు గంటకు కోటి రూపాయలు తీసుకునే కపిల్‌సిబాల్ మరి! ఏడు నెలలు గడిచాక దిల్లీ హైకోర్టులో సిబిఐ అపీలు దాఖలు చేసింది. ఆయన విచారణకు సహకరిస్తానన్నాడు కనుక అరెస్ట్ చేయొద్దని ఈ కోర్టు ఆదేశించింది! తీర్పు రావడానికి ఏళ్లూ పూళ్లూ ఎందుకు గడుస్తాయో తెలిసిందా మరి?
- సుధీర్, శ్రీనగర్

ఇరుకు రోడ్లతో ఇబ్బందులు
కరీంనగర్‌లోని 36 డివిజన్‌లోని అంతర్గత వీధులలో రోడ్డుల అంతటా ఒకే విధంగా లేవు. కొన్నిచోట్ల మరీ ఇరుకుగా వున్నాయ. సెట్‌బ్యాక్ తీసుకోకుండా కట్టిన ఇళ్లు గల వాళ్ళని కూడా ఈ విషయమై విచారించాలి. 36వ డివిజన్లలో ఉస్మానియా కాంప్లెక్స్ రోడ్ మీదుగా సిటీ బస్ వెళ్ళడానికి గల రోడ్డు మార్గాలని పరిశీలించాలి. 36, 35 డివిజన్లతోపాటు మహిళా కళాశాల రోడ్ గుండా సిటీ బస్సు వెళ్ళే అవకాశాలని పరిశీలించాలని మేయర్‌ని కోరుతున్నాం.
- కె.వెంకటేశ్వర్లు, కరీంనగర్