ఉత్తరాయణం

అమరావతికి తెలుగు భాషా పీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్) ప్రాంగణంలో తలదాచుకుంటున్న తెలుగు భాషా పీఠాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలించేందుకు వెంటనే తగుచర్యలు తీసుకోవాలి. తెలుగు భాషకు 2008లోనే ప్రాచీన భాషాహోదా లభించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో వివాదం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. గత ఏడాది మద్రాసు హైకోర్టు తెలుగు భాష ప్రాచీన భాష హోదాకు అర్హమైందేనని తీర్పు ఇవ్వడంతో వివాదం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషాపీఠానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తగు వసతులు కల్పిస్తామని గతంలో కేంద్ర మానవ వనరుల శాఖకు నివేదించింది. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అమరావతికి తెలుగు భాషాపీఠం తరలి వస్తే అనేక పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. రచయితలకు పుస్తక ప్రచురణ కోసం అవసరమైన ఆర్థికసాయం లభిస్తుంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

గురివింద వైఖరి తగునా?
యుపి ఎన్నికల సభలో ‘స్కామ్’ అనే పదానికి కొత్త భాష్యం చెప్తూ ప్రధాని మోది విపక్షాల్ని ఎండగడితే ఆ వ్యాఖ్యలు ప్రధాని హోదాకు తగవని కాంగ్రెస్ పార్టీ సుద్దులు చెప్పింది. మరి గతంలో మోదిని ‘రక్తవ్యాపారి’ అని సాక్షాత్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించడం, అటు తర్వాత రాహుల్ సైతం మోదీని హిట్లర్, తుగ్లక్, బయటివాడు అంటూ విమర్శించడం కాంగ్రెస్ నేతల హోదాకు తగునా? తాము ఏ రీతిగానైనా ప్రధానిని విమర్శించవచ్చు. ఆయన మాత్రం మర్యాద పాటించాలి. గురివింద గింజ తనకింది నలుపును ఎరగని చందంగా ఉంది కాంగ్రెస్ వైఖరి.
- సుభాష్, కాకినాడ

విసుగెత్తిస్తున్న టీవీ సీరియళ్లు
ఒక్క ఆదివారం మినహా అన్ని ప్రధాన టీవీ చానళ్లలో సీరియల్స్ రాజ్యమేలుతున్నాయి. ఒకప్పుడు శనివారం చలనచిత్రాలు వేసేవారు. ఇపుడు వాటిస్థానే సీరియల్స్ వచ్చాయి. సీరియల్స్‌కు ఉన్న ప్రాధాన్యత వేటికీ లేదు. వేసిన సినిమాలనే మళ్లీ మళ్లీ వేస్తున్నందున వీక్షకులకు విసుగు పుడుతోంది. చాలా చానళ్లలో పాత సినిమాల జాడ లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సీరియల్స్‌తో చానళ్లు హోరెత్తుతున్నాయి. సీరియల్స్ ప్రసారానికి పరిమితులు, నియమాలు రూపొందించాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

ఓట్ల కోసం తాయిలాలు
మత మార్పిడులను ప్రభుత్వాలే ప్రోత్సహించడం దారుణం. మైనారిటీల ఓట్ల కోసం క్రైస్తవులకి, ముస్లింలకి రిజర్వేషన్లు, రాయితీలు ప్రకటించడం సరికాదు. పేదవారైన కొందరు హిందువులు తాయిలాలకు ఆశపడి మతం మార్చుకుంటారు. ఈ పాచిక అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆడింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు ఆడుతున్నాయి. అంటే హిందువులందరి దగ్గర అపార ధనం ఉందని, వారికి ఎటువంటి రాయితీలు అక్కర్లేదని ప్రభుత్వం భావిస్తోంది. మత మార్పిడులపై హిందూ సంఘాలు కూడ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.
- సుధీర్, విశాఖ