ఉత్తరాయణం

గ్రూప్-2లో మహిళా అభ్యర్థుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-2 పరీక్షల సందర్భంగా అభ్యర్థులకు నానా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సెంటర్లలో చిన్న పిల్లలకు వేసే బెంచీలనే అభ్యర్థులకు వేయడం గమనార్హం. రోజుకు 5, 6 గంటలు ఆ చిన్న బెంచీలపై కూర్చోలేక అభ్యర్థులు నరకయాతనని అనుభవించారు. మహిళా అభ్యర్థుల వెంట వచ్చిన వారికి పరీక్షా కేంద్రాల వద్ద పడిగాపులు తప్పలేదు. పరీక్ష రాసేవారు చంటిపాపల తల్లులయితే ఆ పసిపిల్లలను చూసుకునేందుకు ఎవరో ఒకరు అండగా వస్తారు. వారికి కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇకముందు జరగబోయే అన్ని పోటీ పరీక్షల సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వీస్ కమిషన్ అధికారులు తగు ఏర్పాట్లు చేయాలి. అన్ని పరీక్షలకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

మొక్కుబడి పరీక్షలు..
పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రీ- ఫైనల్ పరీక్షల లక్ష్యం నెరవేరడం లేదు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు షెడ్యూలు ప్రకారం విద్యార్థులచే ఈ పరీక్షలు రాయిస్తున్నారే కాని, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులకిచ్చి వారు చేసిన పొరపాట్లనుర సరిదిద్దటం లేదు. వీటిని మొక్కుబడిగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులు తాము చేస్తున్న తప్పులను తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ల్లో విద్యార్థులు భాషాపరమైన పొరపాట్లు చేసి మార్కులు పోగొట్టుకుంటారు. మాతృభాష కాని హిందీ, ఇంగ్లీషులలో ఈ పొరపాట్ల శాతం ఎక్కువ. తెలుగులో కూడా వాక్య నిర్మాణంలో, విరామ చిహ్నాల విషయంలో అనేక పొరపాట్లు చేస్తున్నారు. ఇలాంటి సాంకేతిక పొరపాట్లు చేసి విద్యార్థులు నష్టపోయే అవకాశముంటుంది. ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణ వల్ల విద్యాశాఖకు ఎంతో ఖర్చు. చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించడం ఎందుకు? ఇకనైనా పదవ తరగతికి బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఈ పరీక్షలు నిర్వహణ చేపట్టాలి. విద్యా శాఖాధికారులు పర్యవేక్షించి ప్రీ ఫైనల్ పరీక్షల లక్ష్యం వాస్తవంగా నెరవేరేటట్లు చూడాలి.
-జి.అశోక్, గోదూర్ (జగిత్యాల జిల్లా)

నేరగాళ్లకు పగ్గాలు
ప్రస్తుత తమిళ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాలనలో వ్యక్తిపూజ పరాకాష్ఠకు చేరిన సంగతి తెలిసిందే. ఇపుడు నేరగాళ్లకు అన్నాడిఎంకె పార్టీపై, అధికారంపై అజమాయిషీ వచ్చింది. జైలు నుంచి పరిపాలన సాగే రోజులు వచ్చాయంటే ఇది ప్రజాస్వామ్యమా? లేక అరాచకమా? అనిపిస్తుంది. ఉచిత కానుకలకు, మద్యానికి ఓట్లను విక్రయించిన ప్రజలకు- నాయకులు చేస్తున్న ప్రజాసేవ ఇలా తయారైంది. నేటి నాయకుల్లో అధికార కాంక్ష తప్ప ప్రజాసేవాతత్పరత కన్పించదు. రాజకీయ నాయకులను ప్రజలు నమ్ముకుంటే చివరికి అరాచకానికి పునాదులు పడతాయి. వ్యక్తిపూజ వినాశనానికి రహదారి. తమిళ ప్రజలు ఇకనైనా జాగరూకులు కావాలి.
-దేవరపల్లి ఓబులేసు, ఏలూరు

ఏకపక్ష విమర్శలేల?
విశ్రాంత ఆచార్యులు, రాజకీయ ప్రముఖులు తమ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు ఏవేవో వ్యాఖ్యలు చేస్తుంటారు. మీడియాలో అవి విస్తృత ప్రచారం పొందుతుంటాయి. పెద్దనోట్ల రద్దు వృథా ప్రయాస అని అటు ఆర్థిక నిపుణుడు అమర్త్యసేన్ నుంచి ఇటు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం వరకు చాలామంది ఏకపక్ష విమర్శలతో నోరుపారేసుకున్నారు. క్రైస్తవ కానె్వంట్‌లలో చదివిన మహానుభావులకు పాశ్చాత్య దేశాలు స్వర్గంలా, పుట్టి పెరిగిన ఈ దేశం నరకంలాగా కనిపించడం సహజమే మరి. తాను చదివిన కానె్వంట్ శతవార్షికోత్సవంలో చిదంబరం- ‘్భరతదేశానికి జ్ఞానభిక్ష పెట్టింది మీరే’ అంటూ క్రైస్తవ కానె్వంట్‌లను పొగిడారు. అమర్త్యసేన్ దేశానికి చేసిందేమీ లేకపోయినా తరచూ మోదీని విమర్శిస్తూనే ఉంటారు. ప్రచారం కోసం ఎవరిపాట్లు వారివి.
-చంద్ర, కాకినాడ