ఉత్తరాయణం

ఏకాత్మ మానవ దర్శనం నేటి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ శ్రేయస్సు కోసం ప్రస్తుతం ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతం అనుసరణీయం. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా విభేదాలు దాటి జాతికోసం పనిచేసే మనుషుల నిర్మాణం, నేటి అవసరం, వ్యక్తి నిర్మాణం వల్లనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. ‘కలసి వుంటే కలదు సుఖం’ అన్న భావనయే ఏకాత్మ మానవతావాదం. నీతి నిజాయితీలకు పెద్దపీట వేయడం, స్వదేశీని ప్రోత్సహించటం, గ్రామాలను పటిష్టపర్చడం, కుటీర పరిశ్రమల నిర్మాణం- ఇవన్నీ ఏకాత్మ మానవదర్శనంలోని మచ్చుతునకలు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షిస్తూ, అన్ని మతాల సమన్వయాన్ని నొక్కి చెప్పే సిద్ధాంతం ఏకాత్మ మానవతావాదం. ఆచరణలో క్రింద స్థాయికి చేరవేసి దేశాభివృద్ధికి బాటలు వేయాలి.
-సామల కిరణ్, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా

మహిళలకు రక్షణ
ప్రశ్నార్థకమే
ఇటీవల ర్యాగింగ్ భూతానికి ఉషారాణి అనే ఇంజనీరింగ్ అమ్మాయి బలైంది. ఉన్నత చదువు చదివి, ఉద్యోగం చేస్తూ ఆనందకరమైన జీవితంతో తన జీవనయానాన్ని కొనసాగించాలని కోటి కలలతో ఇంజనీరింగ్ కాలేజీ గుమ్మం ఎక్కిన ఆమె కొన్ని నెలలకే అక్కడ నరకాన్ని చవిచూసింది. అందం, చదువు ఆడపిల్ల పాలిట శాపంగా మారి చివరికి అర్థాంతరంగా తనువును చాలించాల్సి వచ్చింది. ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెడతామని ఆమెను లైంగికంగా, మానసికంగా వేధించారు. దీంతో ఆమె విషం మింగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆడపిల్లకు అందం ఉన్నా, తెలివితేటలు ఉన్నా తప్పే. చివరికి ఉన్నతమైన పదవిని అధిరోహించినా అక్కడా చిత్రహింసలే అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఎక్కడ స్ర్తిలు సుఖసంతోషాలతో జీవిస్తారో అక్కడ సిరిసంపదలు ఉంటాయంటారు. నాటి త్రేతాయుగం ద్వాపరయుగం నుండి నేటి కలియుగం వరకు స్ర్తిలకు రక్షణ లేదు. స్ర్తిలకు కుటుంబంలోను, ఆఫీసులలోను రక్షణ కరువవుతోంది.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు