ఉత్తరాయణం

28వ తేదీనే ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనెల 28వ తేదీన అమావాస్య ఉదయం 8.27 గంటల వరకు, 29న తెల్లవారు ఝామున 5.45 గంటల వరకు పాడ్యమి ఉన్నాయి. 29వ తేదీ ఉదయానికి పాడ్యమి లేదు. ఆ కారణంగా 28వ తేదీన మాత్రమే తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ని మనం ఆచరించాలి. పూర్వ పద్ధతి పంచాంగములలో ఉదయం ఏడు గంటల వరకూ 29వ తేదీన పాడ్యమి ఉన్నది కాబట్టి ఆ పద్ధతి వారు 29వ తేదీన ఉగాది అంటున్నారు.
‘దృక్ సిద్ధము’ అనగా కనులకు కనిపించేది అని అర్థము. ఆ కారణంగా దానికి అనుగుణంగానే గణన సాగాలి. ‘దృక్ తుల్యతాం గ్రహా’ అని సూర్య సిద్ధాంతం. ‘చంద్రార్కౌ సాక్షిణౌ’ సూర్యచంద్రులే సాక్షులు అనేది సరియైన విధానం. దృక్ పద్ధతి ప్రకారమే వ్రతాలు, పండుగలు ఆచరించాలి.
ప్రస్తుతం అనుసరిస్తూ ఉన్న దృక్ సిద్ధాంతం 1954లో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పరచిన ‘క్యాలెండర్ రిఫార్మర్ కమిటీ’ వారు నిర్ణయించినది. ఆ కమిటీలో ఆ కాలము నాటి పండితులు పలువురు ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు నిర్ణయించిన విధానంలో భారత ప్రభుత్వం నేటికీ సుమారు 16 భాషలలో పంచాంగాన్ని అందిస్తోంది. అలా కేంద్ర ప్రభుత్వ సమ్మతము దృక్ సిద్ధము. ఆధునీకులు యంత్రముల ద్వారా గమనించినపుడు కనిపించేటటువంటిది అయిన దృక్ సిద్ధ పంచాంగానే్న అనుసరించడం ధర్మం. అన్ని దేశాలలోనూ న్యూ మూన్, ఫుల్ మూన్ పూర్తయ్యే సమయములు దృక్ సిద్ధము ద్వారానే గుర్తించబడుతున్నాయి. ఈ లెక్కల్లోనే గ్రహణాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఉత్తరాయణం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. ‘చంద్రార్కౌ తత్ర సాక్షిణౌ’ అనే మాటను అనుసరించి 28వ తేదీన దృక్ పద్ధతిని అనుసరించి ఉగాదిని ఆచరించాల్సి ఉంటుంది.
- డాక్టర్ సి.వి.బి. సుబ్రహ్మణ్యం

cvbs2003@yahoo.com

వినియోగదారుడే దేవుడు
ఆన్‌లైన్‌లోనూ, షాపుల్లోనూ కోట్లలో వ్యాపారం
ప్రపంచం పిడికిడంత మార్కెట్‌గా మారిన వ్యవహారం
ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్.. సేవల ముసుగులో వ్యాపారం
వినియోగదారుల సంక్షేమార్థం ప్రభుత్వం ఉత్తుత్తి ప్రచారం

వస్తువుల్లో లోపాలుంటేనే కాదు నేరం
బ్యాంకులు, ఆసుపత్రుల నుండి అన్నింటిలో
వినియోగదారులకు చూపాలి పరిష్కారం
వినియోగదారులే దేవుళ్లనే గాంధీగారి బోధనా సారం
పాటించి తీరడం అత్యవసరం

విక్రయించేవాడూ వినియోగదారుడే
భూమిమీద వినియోగదారుడు కానివాడు లేడే!
అమ్మేవాడిలో నిజాయితీ ఉన్ననాడే
వ్యాపారంలో విలువలు పాటించిన నాడే
నాణ్యతకు విలువను ఇచ్చిన నాడే
విజయవంతమైన ‘వరల్డ్ కన్స్యూమర్స్ డే’ (15 మార్చి)
- చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు