ఉత్తరాయణం

మధుమేహం నివారణకు దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో మధుమేహం రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిన్న వయసువారు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వారసత్వంగానే గాక, ఎంతోమంది కొత్తగా మధుమేహ పీడితులవుతున్నారు. ఊబకాయం, ఆహారపు అలవాట్లు, వత్తిళ్లు, ఆధునిక జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వల్ల అధిక శాతం ప్రజలు చక్కెర వ్యాధిగ్రస్తులవుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ఉన్న కొందరు మాత్రమే సక్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు. మందులు, ఇంజెక్షన్లు వున్నా పూర్తి నివారణకు సరియైన మందులు అందుబాటులో లేక సామాన్య ప్రజలు కొని వాడలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మధుమేహం వ్యాప్తి చెందకుండా కొత్త మందులను తక్కువ ధరలకు వ్యాధిగ్రస్తుల లభ్యమయేట్లు, ఈ వ్యాధి గురించి మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలను ప్రారంభించి ఈ వ్యాధిని నివారించాలి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మీడియాలో విస్తృతంగా ప్రకటనలు ఇస్తూ వైద్య చికిత్సకు, మందులకు భారీగా డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. సెలబ్రిటీల చేత ప్రకటనలు ఇప్పిస్తూ జనం జేబులు కొల్లగొడుతున్నారు.
-గర్నెపూడి వెంకట రత్నకర్‌రావు, హనుమకొండ

గురజాడ స్మారక మందిరం నిర్మించాలి
మహాకవి గురజాడ వెంకట అప్పారావు జన్మించిన చోట ఇప్పటికీ స్మారక మందిరం లేకపోవడం విచారకరం. 21-9-1862న విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా యస్.రాయవరంలో మాతామహుని ఇంట ఆయన జన్మించారు. ‘కన్యాశుల్కం’ వంటి గొప్ప రచనలు చేశాక ఆయన 30-10-1915న పరమపదించారు. ఆయన జన్మించిన యస్.రాయవరం (సర్వసిద్ధి రాయవరం) పేరును ‘జి.రాయవరం’ (గురజాడ రాయవరం)గా మార్చేందుకు, గ్రామంలో స్మారక మందిరం నిర్మించేందుకు ఏపి ప్రభుత్వం ఇకనైనా చొరవ చూపాలి.
-జవ్వాది వెంకటరమణ, యస్.రాయవరం

ఎపిపిఎస్‌సి వింత నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) ప్రకటించిన నోటిఫికేషన్‌లో డిగ్రీ అర్హత ఉన్న పోస్టులు సుమారు 442, డిగ్రీ, కంప్యూటర్ కోర్సుల అర్హత ఉన్నవి 540 వరకు ఉన్నాయి. స్క్రీనింగ్ నుండి మెయిన్స్‌కు మొత్తం 982 పోస్టుల నుండి 1:150 నిష్పత్తి అంటే- అనర్హులు కూడా 540 పోస్టులకు పోటీలోకి రావడం దారుణం. కేవలం 540 పోస్టులను డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం వున్న అభ్యర్థుల నుండి మాత్రమే 1:150 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేసి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేయాలని ఎపిపిఎస్‌సిని కోరుతున్నాము. ఈ వింత నిర్ణయంపై పునఃసమీక్షించాలని, భవిష్యత్‌లో కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మా విన్నపం.
-ఎస్.కె.ఖలీల్, నరసరావుపేట

భారమైన వంట గ్యాస్ ధర
ఇటీవల వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరగ్గొట్టడం విచారకరం. డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.90లకు, వాణిజ్య సిలెండర్ ధరను రూ.149లకు పెంచడం దారుణం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్న తరుణంలో అమాంతం వంట గ్యాస్ ధరల పెంచడం అన్యాయం. దేశంలోని అపార చమురు,సహజ వాయు నిక్షేపాలను బడా కంపెనీలకు కట్టబెట్టి గ్యాస్ ధరలను పెంచడం సరికాదు. పెంచిన ధరలను తగ్గించి పేద, మధ్యతరగతి గృహిణులను ఆదుకోవాలి.
-కొలుసు విమల, గరికపర్రు, కృష్ణా జిల్లా