ఉత్తరాయణం

ఆన్‌లైన్‌లో వాహనాలకు లైసెన్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరలక్షకు పైగా ఖరీదున్న ద్విచక్ర వాహనాలను కొనలేక పాత వాహనాలను రిపేర్ చేయించుకుని బయటకు తీసుకొచ్చిన వాటిని పాతవనే పేరుతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేయడం తగదు. అలాగే వాటి రిజిస్ట్రేషన్ వగైరాలన్నీ ఇతర జిల్లాల్లో ఉన్నట్టయితే వాటిని వాహన యజమానులు నివసిస్తున్న జిల్లాకు ఆన్‌లైన్‌లో లైసెన్స్‌లు ఇచ్చేట్టు అనుమతించాలి. ఉదాహరణకు విజయవాడలో రిజిస్టరైన వాహనం ప్రస్తుతం హైదరాబాద్ యజమాని పరం అయితే- హైదరాబాద్ ఆర్‌టిఏ వారు ఈ బండిని విజయవాడ తీసుకెళ్ళి అక్కడ ఆర్‌టిఏ అధికారులకు చూపి ట్రాన్స్‌ఫర్ సర్ట్ఫికెట్ తెచ్చుకోమంటున్నారు. కారయితే వెళ్ళవచ్చు. స్కూటర్ అయితే కష్టం. ఇప్పుడన్నీ ఆన్‌లైన్ అయ్యాయి కదా. అందుచేత ఏ ఆర్‌టిఏ ఆఫీసుకెళ్ళినా బండిని చూపిస్తే సంబంధిత పని పూర్తికావాలి. వాహన యజమానులు ఈ సదుపాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కల్పించుకుని సమస్యను పరిష్కారం చూపాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

వారసత్వ ఉద్యోగాలపై తీర్పు హర్షణీయం
వారసత్వ ఉద్యోగాల పేరుతో సింగరేణి సంస్థలో నియామకాలను చేపట్టడం సమంజసం కాదు. వారసత్వ ఉద్యోగాల నియామకాలపై ‘స్టే’ ఇవ్వడం సమర్ధనీయం కాదని హైకోర్టు తీర్పునివ్వటం హర్షించదగ్గ విషయం. దీని మూలంగా కొత్త ఉద్యోగాలను పొందేందుకు నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది. వారసత్వ ఉద్యోగాలకు అవకాశం ఇస్తే అది కొన్ని కుటుంబాల వారికి వస్తాయి తప్ప కొత్త వారికి అవకాశం ఉండదు. కోర్టు తీర్పు సరైనదే. ఆరోగ్య కారణాల రీత్యా వారసులకు ఉద్యోగాలు, మరణించిన స్థానంలో వారి వారసులకు ఇవ్వాలే తప్ప ఇతర కారణాల మూలంగా ఇవ్వరాదు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి వ్యవహరించాలి.
- ఎ.ఆర్.ఆర్.ఆర్, ఖమ్మం

వైద్యరంగానికి అరకొర నిధులు
ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయాలన్న సంకల్పం మూడేళ్లుగా మూలనపడిపోయింది. దేశ జిడిపిలో కనీసం రెండున్నర శాతం మొత్తాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలన్న గత ప్రభుత్వం నిర్ణయం నాలుగేళ్లుగా అమలుకు నోచుకోలేదు. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా నేటికీ అంతంతమాత్రంగా ఆరోగ్య సదుపాయాలు వున్నాయి. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో నలభై ఎనిమిది కోట్లు ప్రాథమిక ఆరోగ్య రంగానికి కేటాయించినా అది ఏమూలకూ సరిలేదు. వైద్యరంగానికి కేటాయింపులు జిడిపిలో 0.29 శాతం మాత్రమే వుండగా, శ్రీలంక, భూటాన్, నేపాల్, మాల్దీవులు వంటి దేశాల కంటే భారత్ వెనుకబడి వుండడం బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం లభించక ఏటా మరణిస్తున్న వారి సంఖ్య ఇరవై లక్షలకు పైచిలుకు వుండడ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కోలు ఆందోళన వెలిబుచ్చడం ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి