ఉత్తరాయణం

సిరియాపై అగ్రరాజ్యాల దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియాలో రసాయన విష వాయువులను ప్రయోగించిన దాడిలో వంద మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం, మరెంతో మంది తీవ్రంగా గాయపడడం అత్యంత హేయం. ఆ రకమైన ఆయుధాల్ని నిషేధించాక కూడా వాటి వాడకం జరుగుతున్నదంటే అది బీరాలు పలుకుతున్న అంతర్జాతీయ అగ్రరాజ్యాల ద్వంద్వ వైఖరి అ యినా కావాలి లేదా వైఫల్యమైనా కావాలి. అతి ప్రాచీన నాగరికతల్లో మెసపటోమియా తరువాత స్థానం సిరియాదే. ఐక్యరాజ్యసమితి ప్రారంభ సభ్య దేశంగా, అలీన దేశంగా ఘనత కలిగిన ఆ దేశం ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో చితికిపోతున్నదంటే అందుకు అగ్రరాజ్యాలనే నిందించాలి. రష్యా, అమెరికా చెరోవైపు మోహరించి చెడుగుడు ఆడకుండా ఉన్నట్టయితే ఆ దేశంలో ఏదోఒక వర్గం పైచేయి సాధించి ఎంతోకొంత తక్కువ నష్టం జరిగేది. అధ్యక్షుడు అసద్‌ని వెనకేసుకొస్తూ రష్యా, తిరుగుబాటు వర్గాల్ని దువ్వుతూ అమెరికా, సందట్లో ఇస్లామిక్ స్టేట్ వర్గాలు సిరియాని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఫలితంగా ఆరేళ్లలో ఐదు లక్షల విలువైన మానవప్రాణాలు గాలిలో కలవగా, లక్షల సంఖ్యలో ప్రజలు శరణార్థులై రోడ్డున పడ్డారు. ఇకనైనా అగ్రరాజ్యాలు సిరియాని ప్రపంచ పటం నుండి తరిమెయ్యడం మానేసి, కాపాడే ప్రయత్నాలు చెయ్యాలి. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో చైతన్య భూమిక పోషించాలి. రష్యా, అమెరికాలు వేలుపెట్టకుండా ఉంటే రసాయన ఆయుధాల ప్రయోగం అక్కడి ప్రభుత్వ వర్గాలు చేశాయా? తిరుగుబాటు వర్గాలు చేశాయా? అన్నది తేల్చడం పెద్ద విషయమేమీ కాదు. ఆపై నియంత్రించడం కూడా సాధ్యవౌతుంది. అమానవీయ, మానవ కల్పిత పెను సంక్షోభంలో అగ్ర రాజ్యాలు ఆపాటి పెద్దరికం, నిష్పక్షపాత వైఖరి చూపిస్తాయా? అన్నది ఓ పెద్ద సందేహం.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
తగ్గని నోట్ల కష్టాలు
పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడ్డ ఇబ్బందులు నెల రోజుల తరువాత తొలగిపోతాయన్నారు. మూడు నెలలు గడిచిపోయాయి. అయినా కష్టాలు కడతేరలేదు. ఇప్పటికీ అయిదువందల నోట్లు చెలామణీలోకి వచ్చినా, రెండువేల రూపాయల నోటుకు వ్యాపారస్తులు చిల్లర ఇవ్వలేకపోతున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల వాళ్ళు, పెట్రోల్ బంకుల వారు కొంత కమీషన్ తీసుకుని చిల్లర నోట్లిస్తున్నారు. ఇపుడు చాలా ఎటిఎమ్‌లలో నగదు ఉండటం లేదు. బ్యాంకులలో కూడా డబ్బు నిండుకుందని చెబుతున్నారు. మూడు, నాలుగుసార్లు బ్యాంకులలో లావాదేవీలు చేస్తే యూజర్ చార్జీలు వసూలు చేస్తారట. డిపాజిట్ల మీద వడ్డీలు తగ్గించారు. ముందు ముందు డిపాజిట్లమీద, సేవింగ్స్ అక్కౌంట్లమీద వడ్డీలు యివ్వడం మానేసి, నగదు దాచుకున్నందుకు ఛార్జీలు వసూలు చేస్తారేమో!
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
రాజీమార్గం అసాధ్యం
అయోధ్యలోని వివాదాస్పద కట్టడం విషయంలో రాజీయే ఉత్తమమంటోంది సుప్రీం కోర్టు. న్యాయస్థానం రాజీ మార్గం చూపలేనప్పుడు ఇరుపక్షాలు కూర్చుని చర్చించుకుని రాజీ పడడం అసాధ్యం. మతోన్మాదులు రామజన్మభూమిని దురాక్రమణ చేసి, మన సంస్కృతిని ప్రతిబింబింపచేసే కళాకృతిమీద సున్నంతో ప్లాస్టరింగు చేశారు. అక్కడ ప్రతి గుడిమీద గాలి గుమ్మటాలున్నాయి. సుప్రీం కోర్టు రాజీమార్గం చూపాలే గానీ, సమస్యను ఇరుపక్షాలకు వదిలేయడం సరికాదు.
- కె.వి.రమణమూర్తి, కాకినాడ
హడలెత్తిస్తున్న ప్రమాదాలు
జాతీయ రహదారిపై బస్సులు, లారీలు, బైకులు, ఇతర వాహనాల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల నివారణకు ట్రాన్స్‌పోర్టు, పోలీసుశాఖలు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేని కుర్రాళ్లు బైకులు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వేసవి కాలంలో నదులు, చెరువులు, నీటికుంటల్లో స్నానాలు చేస్తూ ఎంతోమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి దుర్ఘటనలకు తమదే బాధ్యత అని తల్లిదండ్రులు తెలుసుకోవడం లేదు. పిల్లలపై పర్యవేక్షణ లేనందునే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
- సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ