ఉత్తరాయణం

ఐక్యత లేని హిందువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలు, క్రైస్తవులు తమ మతాన్ని ఎవరైనా విమర్శిస్తే ప్రత్యక్ష చర్యలకు దిగి సత్తా చూపుతారు. కానీ హిందువులు అలా కాదు. తమ మతం గురించి ఏమీ తెలియకపోయినా సొంత మతంపైనే విమర్శలు చేస్తుంటారు. హిందువులకు హిందువులే శత్రువులుగా మారుతూ తమను తామే బలహీనపరచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిల్ని వేధించే వాళ్లని శిక్షించడానికి ‘యాంటీ రోమియో స్క్వాడ్’లను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రఖ్యాత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ- ‘శ్రీకృష్ణుడే పెద్ద ఈవ్ టీజర్. రోమియో ఈవ్ టీజర్ కాదు, ఆ స్క్వాడ్‌కి యాంటీ కృష్ణా స్క్వాడ్’ అని పేరుపెట్టాలన్నారు. హిందువైన ప్రశాంత్ భూషణ్‌కు కృష్ణతత్వం గురించి తెలియదు. హిందూ తత్వమూ అర్థం కాదు. కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ముక్తసరిగా క్షమాపణ చెప్పి ఊరుకున్నాడు. హిందూ మతాన్ని హిందువులే విమర్శించడం దేశంలో పరిపాటిగా మారింది.
-కృష్ణ, కొండయ్యపాలెం
అవే నోళ్లు ఇలా..!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) కాంగ్రెస్ హయాంలో వచ్చాయి. అప్పుడు ఏ బటన్ నొక్కినా కాంగ్రెస్‌కే ఓట్లుపడుతున్నాయని అలజడి ప్రారంభమైతే అనేక పరీక్షలు జరిపి అది కేవలం తప్పుడు ప్రచారమని నిరూపించింది ఎన్నికల సంఘం. తర్వాత ఇవిఎంలు ఉపయోగించినప్పుడే యుపిలో మాయావతి, దిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రులయ్యారు. ఇటీవల ఆ పార్టీలు ఓడిపోవడంతో ఏ బటన్ నొక్కినా భాజపాకే ఓట్లు పడుతున్నాయని కాంగ్రెస్, ఆప్, బిఎస్పీ ఆందోళన ప్రారంభించాయి. వారెవా! మన నేతలకు బోలెడు నాలుకలు!
-లక్ష్మి, కాకినాడ
చిన్నజిల్లాలు అవసరమే!
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా పదమూడు జిల్లాల పాలన సాగుతోంది. జనాభా, విస్తీర్ణం రీత్యా పెద్ద జిల్లాలుగా ఉన్నవాటిని ప్రజల సౌకర్యార్థం విభజించాలి. అధికార వికేంద్రీకరణ జరగాలంటే కొన్ని పెద్ద జిల్లాలను విభజించాలి. జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ఇప్పటికీ అనేక గ్రామాల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భారీ సంఖ్యలో కాకపోయినా, కొన్ని పెద్ద జిల్లాలలైనా విభజించి పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
-కె.శోభనాచలం, గరికపర్రు
వారసత్వ ఉద్యోగాలు వద్దు
సింగరేణి కార్మికుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను అడ్డుకుంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షదాయకం. సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు గనుకనే వారికి వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని తెరాస ప్రభుత్వం అనడం సరికాదు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలూ పాల్గొన్నారు. ఉద్యమం సందర్భంగా బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుందా? ఉద్యమంలో పాల్గొన్నవారందరికీ ఉద్యోగాలు ఇస్తారా?
-కోసనా మధుసూదనరావు, అమలాపురం