ఉత్తరాయణం

మభ్యపెట్టేందుకే సర్వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు తెలంగాం సిఎం కేసిఆర్. గత ఏడాది అన్ని పార్టీల రాజకీయ నాయకుల పనితనం గురించి సర్వేలు నిర్వహించి, ఎవ్వరూ తప్పుపట్టకుండా ఉండేందుకు కొందరు ప్రతిపక్ష నాయకుల పనితీరుకు కూడా మార్కులు ఎక్కువ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుపై సర్వేలు నిర్వహించి అందరినీ మభ్యపెట్టారు. సొంత సర్వేలు నిర్వహించి, వచ్చే ఎన్నికల తర్వాత కూడా తమ ప్రభుత్వమే వస్తుందని మానసికంగా ప్రజలను ఆయన సిద్ధం చేస్తున్నారు. 111 సీట్లు ఖాయమని ధీమాగా చెబుతున్నారు. మిగతా సీట్లను ప్రతిపక్షాలకు వదిలివేశారు. నిజంగా ప్రజల్లో ఇంత బలం ఉంటే సర్వేలు అనవసరం. ఎన్నికల ముందు అన్నివర్గాల వారిని ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటించడం ఆనవాయితీ. భవిష్యత్ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా సిఎం పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే మున్సిపల్ కార్మికులకు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచారు. ఉద్యోగులకు డి.ఎ. బకాయిలను దశల వారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బీసీ వర్గాలకు వరాలు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సి.లకు అలవెన్సులు, విఆర్వోలు, విఆర్‌ఎలకు జీతాల పెంపు, నామినేటెడ్ పదవులకు నియామకాలు జరుపుతూ ఆయా వర్గాల వారిని సంతృప్తిపరచటం చూస్తున్నాము. ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి సర్వేలు అవసరమా? ప్రజల మద్దతు ఉంటే ఏ సర్వేలూ అక్కర్లేదు. కానీ- రైతులు, నిరుద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఆశాజనకంగా లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వస్తుందని ఆశ చూపుతున్నారు. ఆశించిన మేరకు నియామక ప్రకటనలు రావటం లేదు. ఏది ఎలా ఉన్నా- గత పాలకుల కంటే భిన్నంగా పనిచేస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో ఇప్పుడే చెప్పలేం.
- అయినం రఘురామారావు, ఖమ్మం
రాష్టప్రతిగా అద్వానీ అర్హుడే
భారత రాష్టప్రతి పదవికి అన్నివిధాలా అర్హుడైన నేత- బిజెపి మహానాయకుడు లాల్‌క్రిష్ణ అద్వానీ మాత్రమే. ఆయనను దేశాధ్యక్షుడిగా ఎన్నుకొంటే ‘పెద్దమనిషికి పెద్దరికం’ అప్పజెప్పినట్లు ఉంటుంది. బహుకాలం నుంచి ప్రజాజీవితంలో వుండి ప్రజాస్వామిక వాదిగా, గొప్ప ప్రజానాయకుడిగా వివిధ పార్టీల నాయకులచే గౌరవింపబడుతున్న మహానేత అద్వానీజీ. అలాంటి వ్యక్తిని గౌరవభావంతో రాష్టప్రతి పదవికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తే భారతీయులందరికీ సంతోషదాయకం. బిజెపి నేతలందరూ ఈ విషయమై ఏకగ్రీవంగా తీర్మానించాలి.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
సమస్యల్లో ఉస్మానియా ఆసుపత్రి
తెలంగాణకు ఉస్మానియా ఆసుపత్రి తలమానికంగా ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన రోగులు వైద్యం కోసం నిత్యం ఈ ఆస్పత్రికి భారీ సంఖ్యలో వస్తుంటారు. రోగులను పరామర్శించేందుకు వచ్చే బంధుమిత్రులు ఆస్పత్రి వద్ద ఆటోలు, తోపుడుబండ్లు వుండటంతో నానా అవస్థలు పడుతున్నారు. ఆటోవాలాలు తమ ఇష్టం వచ్చినట్లు వాహనాలను ఉంచటం వల్ల రోగులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా ఈ విషయాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరించటంతో ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఆటోలు, ఇతర వాహనాలను నియంత్రించనందున ఆసుపత్రికి వచ్చే అంబులెన్సులు, వైద్యుల వాహనాలకు ఆటంకం కలుగుతున్నది. కొన్ని సమయాల్లో ప్రజలు, ఆటోవాలాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ విషయమై వెంటనే స్పందించి అధికారులు తగుచర్యలు తీసుకోవాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు