ఉత్తరాయణం

అన్సారీకి అవకాశం లేనట్లే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన రాష్టప్రతిగా ప్రస్తుత ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీని ఎంపిక చేయాలని భాజపాకు ఎవ్వరూ సిఫారసు చేయనక్కరలేదు. రాష్టప్రతి పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకునే సత్తా ఆ పార్టీకుంది. రాజ్యసభ అధ్యక్షునిగా అన్సారీ విపక్షాలవైపే ఎక్కువగా మొగ్గు చూపేవారన్న ప్రచారం ఉంది. అలాంటి వ్యక్తిని రాష్టప్రతిగా ఎంపిక చేసుకుని కొత్త తలనొప్పులు తెచ్చుకోవాలని ఏ పాలక పార్టీ కోరుకోదు. ప్రస్తుత పరిణామాల మేరకు ఏ పార్టీకీ చెందని సమర్థుడైన దళిత వ్యక్తిని ఆ పీఠంపై కూర్చోబెట్టాలని భాజపా భావన అన్న ప్రచారం కూడా ఉంది. భాజపా ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినా మీడియా ఇప్పటికే ఒక పేరు వెల్లడించింది. రాష్టప్రతి ఎన్నిక సమయానికి ఆ ఆలోచన సైతం మారవచ్చు కూడా.
-స్నేహమాధురి, పెద్దాపురం
ఇంకెంతకాలం రిజర్వేషన్లు..
భారత రాజ్యాంగ నిర్మాతగా డా.బిఆర్ అంబేద్కర్ దళితులు, వెనుకబడినవారికి రిజర్వేషన్ సదుపాయాన్ని కొంతకాలం వరకే ఇవ్వమన్నాడు కానీ ఎల్లకాలం కాదు. అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులు కొన్ని వర్గాల ఓట్ల కోసం ఈ రిజర్వేషన్లను పొడిగిస్తూపోతున్నారు. ఇంకా ఎంతకాలమిలా చేస్తారు? మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దళితులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సభాపతులు వంటి పదవులతో పాటు అత్యున్నతమైన రాష్టప్రతి పదవిని కూడా చేపట్టడం జరిగింది కదా! దళితుల చదువుల కోసం వసతి గృహాలు,ప్రత్యేక పాఠశాలలు వున్నాయి కదా! అందరిలాగే వారూ చదువుకొంటున్నారు కదా! మరి వారు మిగతా వారితో పోటీపడి విజృంభించక రిజర్వేషన్లు ఎందుకు? ఆర్థికంగా బలహీన స్థితిలో వున్నవారినే ఆదుకోవాలి. కులం ఏదైనా ఆర్థిక సంపన్నులకు రిజర్వేషన్ వర్తింపచేయరాదు. బిసి రిజర్వేషన్ల పుణ్యమాని ఒకటి, రెండు కులాల వారే పదవులు దక్కించుకుంటున్నారు. మిగతా బిసిలకు అన్యాయం జరగడం లేదా?
-కె.వెంకటేశ్వర్లు, కరీంనగర్
పగలు లైట్లెందుకు?
పట్టపగలు కూడా హెడ్‌లైట్లు వేసి నడపాలని బిఎస్-4 ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు సూచించడం ఎందుకో అర్థం కాదు. దీని గురించి విచారిస్తే కాలుష్యం తగ్గించడానికని తెలిసింది. అన్ని వాహనాలకూ ఈ నియమం వర్తించాలిగా మరి. పగలు లైట్లు వేయడం వల్ల కాలుష్య నివారణ ఏ శాస్త్ర ప్రకారం తగ్గుతుందో తెలియదు. బ్యాటరీల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంధనం ఖర్చవుతుంది. బల్బులు కూడా త్వరగా మాడిపోతాయి. వాహనదారులకు ఖర్చు పెరుగుతుంది. కాలుష్య నివారణే నిజమైతే వీధి దీపాలను కూడా వెలగనివ్వాలి కదా. ఇదేమి రూలో పెద్దలు ఆలోచించాలి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
‘అన్న’ క్యాంటీన్లు తెరవండి
ప్రస్తుతం చాలా ప్రాంతాలలో హోటళ్లలోని పదార్థాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిలో పేదలు, సామాన్యులు, ప్రయాణికులు, హోటళ్లకు వెళ్లి అల్పాహారాలు, భోజనాలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. తినుబండారాల ధరలు తగ్గాలని పేద, మధ్య తరగతి వారు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపి ప్రభుత్వం ‘అన్న’ కాంటీన్లను అన్ని చోట్లా ప్రారంభించాలి. ఫలహారాలు, భోజనాలు, ఇతర ఆహార పదార్థాలను తక్కువ ధరలకు అందించాలి.
-జె.సుధాకరరావు పట్నాయక్, కాకినాడ