ఉత్తరాయణం

క్రికెట్ కాలుష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది యుద్ధమా? జబ్బా? వైరస్‌నా? కాలుష్యమా? జూదమా? కలహాల కుంపటా? టైం కిల్లరా? సస్పెన్స్ థ్రిల్లరా? దేశభక్తికి కొలమానమా? ఏమని పోల్చాలో ఈ క్రికెట్‌ని.. ఆట అంటే వినోదం అనే పరిధిని దాటి బహుముఖ వికృత ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఆటంటే అన్నీ కాదు ఒక్క క్రికెట్‌కే ఆ మహద్భాగ్యం దక్కింది. పాకిస్తాన్‌కి, భారత్‌కి మధ్య మ్యాచ్ పడితే అది యుద్ధం కంటే ఎక్కువ అన్నంతగా మన భావనని మార్చేసుకున్నాం. ఇక ఎలక్ట్రానిక్ మీడియా ముందస్తుగా చేసే హడావుడి ఇంతా అంతా కాదు. సరిహద్దుల్లో సైనికులతో ఇంటర్వ్యూలు, డ్యాన్సులు, మ్యాచ్ మనమే గెలవాలనే శుభాకాంక్షలు, దానికి తగిన పాటలతో తెగ ఊదరగొట్టేస్తారు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే కాశ్మీర్ ఇక పూర్తిగా మనదే అన్నట్టుగా రెచ్చిపోతారు. పదకొండు మంది ఆటగాళ్ళ తరఫున కోట్లాదిమంది ప్రజలు నిర్ణయించేస్తారు పాక్‌పై విజయం మనదేనని. మ్యాచ్‌కి ముందు పూజలు, హోమాలు, నినాదాలు, కోట్లాది రూపాయల బెట్టింగులు, ఇంక వీటిని ‘్ఫలో’ అవుతూ రకరకాల వికారాలు. కొందరు బెట్టింగ్‌ల్లో డబ్బులు తగలేసుకొని నాశనం.. కొందరు ఎక్కువగా ఊహించేసుకొని సీన్ రివర్స్ అయితే తట్టుకోలేక ఢమాల్.. కొందరికి ఓటమిని జీర్ణించుకోలేక మానసిక రోగాలు, ఆవెంటే అనేక సమస్యలు. నిజానికి క్రికెట్‌ను ‘పది తలల అనకొండ’లా మార్చింది మనమే, మన బహుళ జాతి కంపెనీలే, మన ప్రభుత్వాలే. మన దేశంలో ఓ క్రికెట్ క్రీడాకారుడికి, ప్రముఖ సినిమా హీరోకి ఉన్న విలువ కోట్ల రూపాయలతోనే తూచాలి. క్రికెట్ గురించి చర్చ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. క్రికెట్ క్రీడాకారుడంటే దేశాన్ని రక్షించే దేవుడులాగా ఎత్తేస్తాం. అవసరానికి మించి విలువ ఇచ్చేయడం చాలా హానికరం. క్రికెట్ పిచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల లావాదీవీలు చేయిస్తోందంటే ఇది మహమ్మారి కాక మరేమిటి? క్రికెట్ అంటేనే దేశభక్తి, క్రికెట్ మ్యాచ్ చూసినవాడే దేశభక్తుడు అనే జాఢ్యం ఈ దేశంలో వదిలే ఛాయలైతే కనబడటం లేదు. ఆటని ఆటలాగా చూసే ధోరణి ప్రజలలో కనిపించే సూచనలు ఏమీ లేవు. కోట్లాది రూపాయల బెట్టింగుల ప్రవాహానికి అడ్డుకట్ట లేకుండా పోతోంది. వేలం వెర్రిగా క్రికెట్ క్రీడాకారులకు పారితోషికాలు అనవసరం. అన్ని క్రీడల వలే దీన్ని కూడా చూసే దృష్టిని సమాచార వ్యవస్థ, ప్రభుత్వం కల్పించాలి. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతే మన దేశాన్ని జయించేసినట్టు కాదు. మన క్రీడాకారులకు కూడా మితిమీరిన సంపద, విలాసాలు, అతిగౌరవం లాంటి కారకాలవల్ల అహంకారం, అతివిశ్వాసం, నిర్లక్ష్యం లాంటి రోగాలు రావడం సహజమే కదా! ఈ క్రికెట్ కాలుష్యం నివారణకు అందరం కొంచెం ఆలోచించాల్సిందే.
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు
తీరుమారని మమత
భాజపా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికీ గుడ్డిగా వ్యతిరేకిస్తూ తీవ్ర విమర్శలు చేయడం సరికాదు. మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తే మమత తీవ్రంగా ఆక్షేపించి ఉద్యమం చేస్తానని ప్రకటించింది. ఓసారి ముఖ్యమంత్రుల సమావేశాన్ని మోదీ ఏర్పాటు చేయగా ఆమె గైర్హాజర్ అయింది. జిఎస్‌టి బిల్లును ఆమోదించే ప్రసక్తి లేదని హెచ్చరించింది. తన రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో గూర్ఖాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తుండగా శాంతిభద్రతలను కాపాడంలో మమత విఫలమైంది. రాష్ట్ర పోలీసులు గూర్ఖా ఉద్యమాన్ని నిలువరించలేక పోవడంతో చివరికి సైన్యాన్ని పంపాలని ఆమె కేంద్రాన్ని కోరింది. సైనికుల రాకతో డార్జిలింగ్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహకరించుకోవాలని మమత ఇప్పటికైనా తెలుసుకోవాలి.
- లక్ష్మి, పేర్రాజుపేట