ఉత్తరాయణం

ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంట గ్యాస్ (ఎల్‌పిజి)పై సబ్సిడీ వదులుకోవల్సిందిగా కేంద్ర ప్ర భుత్వం ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు కోటిమంది వినియోగదారులు సహకరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతభత్యాలు భారీగా పెంచడం సమంజసం కాదు. వీరికి అరవై శాతం వేతనాలు పెంచటం, ఇంటి అద్దె, రైలు చార్జీలు, పేపరు ఖర్చులు, కారు లోన్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. 2004 అక్టోబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలుకు కేంద్రం ఉపక్రమించింది. వీరంతా ముప్ఫై ఏళ్లకు పైబడి ప్రభుత్వంలో కొలువు చేస్తారు. ఐదేళ్లు మాత్రమే సేవలందించే ప్రజాప్రతినిధులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ వర్తింపజేస్తే ఖజానాపై భారం పడదు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి భారీగా ఆస్తులు సంపాదించే నేతలకు విదేశీ వైద్యం వంటి సౌకర్యాలు కల్పించారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇస్తామని ఆరేళ్లుగా ప్రభుత్వం చెబుతోందే తప్ప ఆచరణలో అమలు కాలేదు. పదో వేతన సవరణ బకాయిలను ఉద్యోగులకు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. కానీ ప్రజాప్రతినిధుల వేతనాలు, రాయితీల పెంపునకు మంత్రదండం ఏదైనా ఉందా? ప్రజా ప్రతినిధులకు కొన్ని సౌకర్యాలు కలిగించవచ్చు. అయితే, ప్రభుత్వోద్యోగులను సవతి తల్లి పిల్లలుగా చూడవద్దు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
విభజన రాజకీయాలు వారివే..
భాజపా విభజన రాజకీయాలు కొనసాగిస్తే అడ్డుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించింది. అరిగిపోయిన రికార్డులను మళ్లీ మళ్లీ వినిపించడం తప్ప కాంగ్రెస్ వాస్తవాలు గ్రహించడం లేదు. 2014లో తమ ఓటమికి కారణం మైనారిటీలను నెత్తికెక్కించుకుని హిందువుల్ని చిన్నచూపు చూస్తున్నట్టు ప్రజలు భావించడమే అని కాంగ్రెస్ నేత ఆంటోని నివేదిక స్పష్టం చేసినా సోనియా గ్రహించడం లేదు. ప్రభుత్వ పథకాల ఫలాలన్నీ ముందుగా మైనారిటీలకే దక్కాలంటూ అగ్నిలో ఆజ్యం పోశాడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. నిజానికి కాంగ్రెస్‌వే విభజన రాజకీయాలు అని స్పష్టం అవుతుంది.
-లక్ష్మీ, కాకినాడ
శిథిలావస్థలో అపురూప ఆలయం
విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని ప్రాచీన అమరేశ్వర ఆలయం అధికారుల నిరాదరణకు లోనై ప్రాభవాన్ని కోల్పోతోంది. పవిత్ర గోస్తనీ నదీ తీరాన శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఎన్నో చారిత్రక, పురాణ విశేషాలను సొంతం చేసుకున్న మహిమాన్విత ఆలయంగా వినుతికెక్కింది. ఇక్కడి అద్భుత శిల్పకళా సౌందర్యం, అపురూప కట్టడాలు శిథిలాస్థకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భక్తులకు కనీస సౌకర్యాలు మృగ్యం. ధూప దీప నైవేద్యాల కోసం వున్న ఏడెకరాల మాన్యం స్వాహా అయినట్లు కథనాలు వెలువడ్డాయి. హిందూ మత వైభవం, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నాలైన దేవాలయాల పరిరక్షణకు పాలకులు తక్షణం నడుం బిగించాలి.
సి.ప్రతాప్, శ్రీకాకుళం