ఉత్తరాయణం

‘ఎర్రవారి’ దేశభక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎర్రరంగు వాళ్లు’ ఈ దేశానికి ఎంత గొప్ప భక్తులో ఈ సంఘటన చెబుతోంది. ముగ్గురు ఆకతాయి కుర్రాళ్లు రైల్లో ఒక ముస్లిం కుర్రాడిని చంపడానికి- దేశమంతానూ, కేంద్ర ప్రభుత్వమూను కారణమే అన్న విధంగా షబ్నా ఆజ్మీ, అపర్ణసేన్ మొదలైన ‘వీరు’లంతా అన్ని మెట్రో నగరాల్లోను ఉద్యమాలు చేస్తున్నారని వార్త. వాళ్ల గుండెల్లో వున్న దేశభక్తి గోదావరి వె ల్లువలాగా ప్రవహించడం సహజమే. కానీ మరి- గత ఏడాది బెంగళూరులో ముగ్గురు ముస్లిం యువకులు వాళ్ల స్నేహితుడైన ఒక హిందూ యువకుడిని చిన్న కారణంగా గొంతుకోసి పారిపోయిన ఘటన పట్ల ఈ ‘వెల్లువ దేశభక్తి’ వాళ్లకి ఏమైంది? మోసంతో హిందువును చంపితే దేశభక్తి ఉండదా?
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
ఇంత పిచ్చి దేనికి?
పాక్, భారత్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ని యుద్ధంగా అభివర్ణిస్తూ మీడియా అనవసర భావోద్రేకాలు రెచ్చగొడుతున్నది. భారత్ గెలుస్తుందన్న అంచనాలతో ఊదరగొడుతూ మరింత హైప్ పెంచుతోంది. చాంపియన్‌షిప్ ట్రోఫీ ఫైనల్లో 30 సెకండ్ల టీవీ ప్రకటనకు కోటి రూపాయలు వసూలు చేసారంటే ఈ హైప్ జనంలో ఎంత పిచ్చి ఎక్కించిందో అర్థం అవుతోంది. బెట్టింగ్‌లు ఏ స్థాయికి చేరాయో ఊహించలేం. ఇంతా చేస్తే భారత్ చిత్తు అయి అవమానం మూటగట్టుకుంది. ఆటని ఆటగా చూడాలి గానీ యుద్ధంగా భావించరాదు.
-గిరిధర్, కాకినాడ
పెద్దాసుపత్రి దీనావస్థ
ఉత్తరాంధ్ర ప్రజల పాలిట సంజీవినిగా పేరుగాంచిన విశాఖలోని కింగ్ జార్జి ఆస్పత్రి పలు సమస్యలతో సమమతమవుతూ రోగులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణమంతా తీవ్ర అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కుక్కలు, పందులు, ఆవులు యధేచ్ఛగా సంచరిస్తూ రోగులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. వార్డుల్లో ఎలుకలు, బొద్దింకలు, క్రిమికీటకాదులతో పరిసరాలు జుగుస్సాకరంగా ఉన్నాయి. మార్చురీ నుండి అరకిలోమీటరు వరకు దుర్వాసన వస్తుంటుంది. ఆస్పత్రిలో దళారుల హవా కొనసాగుతోంది. చేతులు తడపనిదే మంచాలు, టెస్టులు, మందులు లభ్యం కావు. పేదరోగులను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఓ మతానికి చెందినవారు వార్డులలోకి వచ్చి పెద్ద గొంతుతో ప్రార్ధనలు చేస్తూ రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. రోగుల సమస్యలపై వైద్యశాఖ తక్షణం స్పందించాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
రజనీకాంత్ తమిళుడే..
ఎం.జి.రామచంద్రన్ మలయాళీ, కరుణానిధి తెలుగువాడు, జయలలిత కన్నడిగ. వీరందర్నీ తమిళులు ముఖ్యమంత్రుల్ని చేయలేదా? సినీనటుడు రజనీకాంత్ ఎక్కడో పుట్టినా, జీవితంలో సగభాగానికిపైగా తమిళ సినీ రంగానికి అంకితమైనందున ఆయన ముమ్మాటికీ తమిళుడే. జన్మించిన రాష్ట్రానికో, మాతృభాషకో ముడిపెట్టి రజనీపై నిందలు వేయడం తగదు. ఆంధ్రావారు తెలంగాణలో దశాబ్దాల క్రితం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వచ్చి సెటిలయి పోలేదా? తెలంగాణ నాయకులలో కొందరి మూలాలు ఆంధ్రకు చెందినవి కాదా? ఏ వ్యక్తి ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు, ఏ ప్రాంతంలోనైనా శాశ్వతంగా నివసించవచ్చుననే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాదనడం నేరమవుతుంది. రజనీకాంత్ తమిళ రాజకీయాలలో చేరడంలో తప్పులేదు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్