ఉత్తరాయణం

బోరు గుంతలా? మృత్యు కూపాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూడ్చకుండా వదిలేసిన బోరు గుంతల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో నిత్యకృత్యంగా మారాయి. ఈ విషాద ఉదంతాలను నివారించేందుకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కడైనా ఇటువంటి సంఘటన జరిగితే వెంటనే ఆ బోరుగుంతకు సమాంతరంగా గోతులు తవ్వడం, సహాయక చర్యలను టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం తంతుగా మారింది. ఈ ఘోరాలకు అసలు కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. పాపం పుణ్యం ఎరుగని చిన్నారులు బోరుబావిలో పడి అనుభవించే మరణ యాతన తలచుకుంటే ఒళ్లు జలదరించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అటువంటి మరణం పగవాడికీ కలగకూడదని మానవత్వం వున్న ప్రతివారూ కోరుకుంటారు. ముందు జాగ్రత్త చర్యలను బోరింగ్‌లు వేయించేవారు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా వుంటాయి. ఈ విషయమై ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి. బోరు బావి తవ్వించుకునే వారు ముందుగా పంచాయతీ ఆఫీసులో, పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. బోరు బావికి తక్షణమే హ్యాండ్ పంపుగానీ, మోటారు గానీ అమర్చుతామని, ఒకవేళ ఆలస్యం అయ్యే పక్షంలో గుంత వద్ద ఒక కాపలాదారుని వుంచుతామని, మోటారు వైర్లు జంతువులకు, పిల్లలకు అందుబాటులో వుండకుండా అమర్చుతానని తెలియజేయాలి. పూడ్చకుండా మధ్యలో వదిలేసిన బోరుబావిలో జంతువులు, పిల్లలు పడిపోకుండా ఐరన్ కేస్‌తో సీల్ చేసి దానికి తాళం వేస్తామని, అందరికీ తెలిసేలా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని రైతులు హామీ ఇవ్వాలి. బోర్లు తవ్వే యంత్రాలను అద్దెకు ఇచ్చేవారు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా బోర్‌వెల్ హాండ్ పంపుకానీ, మోటారు కానీ పాడై రిపేర్‌కి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా బోర్‌లో జంతువులు, పిల్లలు పడిపోకుండా వుండేట్టు ఐరన్ కేస్‌తో సీల్ చేసి దానికి తాళం వేశామని, ఒక కాపలాదారుని నిర్విరామంగా ఉంచామని బోర్ యజమాని స్థానిక అధికారులకు తెలియజేయాలి. నిబంధనలు ఉల్లంఘించే రైతులను, బోర్‌వెల్ కంపెనీల ప్రతినిధులను చట్టపరంగా శిక్షించాలి. ఎలాంటి ప్రమాదాలు జరిగినా వీరిని బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలి. బోరు గుంతల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించాలి. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తప్ప ప్రభుత్వాలు స్పందించని పరిస్థితులు నేడు నెలకొన్నాయి. గనుక ఈ విషయమై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నపుడు ఏ కుటుంబానికీ కడుపుకోత వుండదు. నిపుణులు కూడా ఈ విషయమై ప్రభుత్వాలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. రాళ్లతోనో, మట్టితోనో బోరుగుంతలను తాత్కాలికంగా పూడ్చినా- వర్షాలు కురిస్తే తిరిగి ప్రమాదకర పరిస్థితి తప్పదు. గనుక గుంతలను పూడ్చేందుకు శాశ్వత ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకూ జరిగిన విషాద ఘటనలను గమనించైనా ప్రభుత్వాల్లో చలనం కలగాలి.
-సివిఆర్ కృష్ణ, హైదరాబాద్
ద్వేషంతోనే విమర్శలు
ఇనే్నళ్లకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ- ‘కోపం, ద్వేషం అనేవి ప్రజా సమస్యల్ని పరిష్కరించలేవు’ అన్న నగ్నసత్యాన్ని చెప్పాడు. అసలు విషాదం ఏమంటే అతడు ఈ సూక్తిని అధికార పక్షానికి చెప్పాడు. కానీ, ఆయన సొంత పార్టీయే దాన్ని పాటించలేదు. కాంగ్రెస్ మాత్రమే కాదు, విపక్షాలు కూడా అయిన దానికి కాని దానికి భాజపాను కోపంతోనూ, ద్వేషంతోనూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. బాధ్యతాయుత ప్రతిపక్షాలుగా అవి పనిచేయడం లేదు. అందుకే యుపిలో విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడినా దారుణంగా విఫలం చెందడానికి వారిలోని కోప ద్వేషాలే కారణమయ్యాయ.
-సత్య, కరప