ఉత్తరాయణం

యోగా శిక్షకులను నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు అలకగానే పండగ కాదంటారు. అలాగే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం యోగాపై ప్రత్యేక దృష్టిని పెట్టినందున రాష్ట్ర ప్రభుత్వాలుకూడా తదనుగుణంగా స్పందించాలి. అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో తగు పాఠ్య ప్రణాళికను రూపొందించి ఆ తరువాత యోగా శిక్షకులను నియమించడానికి చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం తదితర విశ్వవిద్యాలయాలు యోగా కోర్సులను ప్రారంభించాయి. డిప్లమో, సర్ట్ఫికెట్, డిగ్రీకోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రాలను అందచేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఆరు చోట్ల యోగా శాఖలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో యోగా శిక్షకులను నియమించాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు
స్కాంలు.. మోసాలు
భారతదేశం స్కాంలు, మోసాలతో కునారిల్లుతోంది. హర్షద్ మెహతా వేలకోట్ల కుంభకోణంలో అరెస్టు అయి కేసు అనేక సంవత్సరాలు నడుస్తున్న తరుణంలో మృతి చెందాడు. గతంలో ఎన్నో ఏళ్ల క్రితం గుజరాత్ సేవింగ్స్ అనే పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించి మధ్యలో ప్రజలను మోసం చేసి ఉడాయించారు. అగ్రిగోల్డ్ సేవింగ్ పేరుతో సంస్థలు స్థాపించి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టి కొన్ని కోట్ల బకాయిలు వినియోగదారులకు చెల్లించాల్సి వుంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ బంధువులు సైతం ఒక కంపెనీ వ్యవహారంలో వెలుగులోకి వచ్చారు. తమిళనాడులో మారన్ సోదరులు, లాలుప్రసాద్‌యాదవ్ పశుగ్రాసం స్కాంలో దొరికిపోయి జైలుపాలయ్యారు. ఇంకా అనేక రాష్ట్రాలలో స్కాంలు జరుగుతున్నాయి. విచారణలు జరుగుతున్నాయి. కానీ ఫలితాలు ఆశాజనకంగా లేవు.
-అయినం రఘురామారావు, ఖమ్మం
ఆ రెండు దేశాలను దారిలో పెట్టాలి
ప్రధాని మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన ఈ మూడుసంవత్సరాల కాలంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు ఆర్థిక సంస్కరణలు దేశ పురోగమనానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఐతే ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ సరిహద్దులలో మన సైనిక గస్తీ దళంపై కాల్పులు జరుపుతు కాశ్మీర్‌లోను దేశ ఇతర ప్రాంతాల్లోను ఉగ్రవాదులను చొప్పించేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తున్నది. మన ప్రభుత్వం పాకిస్తాన్‌ను అలాగే చైనాను కట్టడి చేసే దిశగా ప్రత్యేక దృష్టిపెట్టాలి.
-గర్నెపూడి వెంకట రత్నాకరరావు, హన్మకొండ