ఉత్తరాయణం

ఈ సామాజిక వర్గం పాపమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న ఒక సామాజిక వర్గాన్ని అవహేళన చేసేలా ఇటీవల సినిమాలు నిర్మిస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల గురించి, వారి ఆచార వ్యవహారాల జోలికి సినిమా వాళ్లు వెళ్లరు. కారణం వారు తిరగబడతారు అనే కదా! కేవలం వ్యాపార దృష్టితో చూస్తూ అవగాహన రాహిత్యం వలన ఇటువంటి పోకడలు ఏర్పడుతున్నాయి. కొన్ని సామాజిక వర్గాల్లో కట్టుబాట్లు, ఆచారాలు, మత విశ్వాసాలు ఏనాటి నుంచో ఉన్నాయి. అటువంటి వాటిని కించపరిచి మనోభావాలు దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదు. ప్రాచీన సంప్రదాయాలను, వేద మంత్రాలను అపహాస్యం చేస్తూ పాటలు రాయడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి పోకడలు విలువల పతనానికి నాంది మాత్రమే!
-జిఎస్‌కె మోహన్, విజయవాడ
విశాఖపై టిటిడి చిన్నచూపు
విశాఖ నగరంపై తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నచూపు చూడడం బాధాకరం. ఈ మహానగరంలో కేవలం ఎంవిపి కాలనీలో మాత్రమే టిటిడి కల్యాణమండపం ఉంది. అదనంగా మరికొన్ని కల్యాణ మండపాలను నిర్మించాలి. టిటిడి కల్యాణ మండపాలు లేనందున పేద, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విశాఖలో ఆక్రమణదారుల నుంచి భూములను విముక్తి చేస్తే కల్యాణ మండపాలు నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుంది.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు