ఉత్తరాయణం

అవగాహనతో వ్యాధుల నిర్మూలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగీ, ఆంత్రాక్స్ వంటి వ్యాధులు ఏటా వందలాదిమందిని బలి తీసుకుంటున్నాయి. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి. పౌష్టికాహారం, పరిశుభ్రమైన నీరు, పరిసరాలపై అవగాహన లేమితో ఈ వ్యాధులు ప్రజలను ఆవహిస్తున్నాయి. బాధితులు కూడా మూఢ నమ్మకాల నేపథ్యంలో వైద్యం చేయించుకోవడానికి నిరాకరించడం, వైద్యులు సంబంధిత ఆసుపత్రుల్లో బాధ్యతగా విధులు నిర్వహించకపోవడం వంటి సవాలక్ష కారణాలతో గిరిజన ప్రాంతాలు వ్యాధుల గుప్పిట్లో వణుకుతున్నాయి. ప్రభుత్వం వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. మరణాలు సంభవించినపుడు అధికారులు, పాలకులు హడావుడి చేస్తుండగా ఆసుపత్రి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచాలపై ఉతికిన దుప్పట్లు, గదుల్లో ఫినాయిల్ వాసనలు, ఇతర హంగులతో సిబ్బంది హంగామా చేస్తారు. ఈ పనులు నిరంతరం చేయించడం, ఆకస్మిక తనిఖీలతో అప్రమత్తం చేయడంతోపాటు ప్రజలకూ వ్యాధులపై అవగాహన కల్పించడం వంటివి కొనసాగాలి. గ్రామాల్లో ఫాగింగ్ యంత్రల ద్వారా దోమల నిర్మూలన, పందులు, కుక్కల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎన్నో వ్యాధులకు ప్రారంభ దశలోనే చరమ గీతం పాడవచ్చు. అవయవాలను మారుస్తున్న ఈ ఆధునిక వైద్య ప్రపంచంలో అంటువ్యాధులను అరికట్టలేకపోవడం అమానవీయం. అన్ని వర్గాలు బాధ్యత వహిస్తే ఎటువంటి వ్యాధులనైనా తరిమికొట్టవచ్చు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
సంపాదనే ప్రధానమా?
క్రికెటర్లుగా తాము దేశానికి చేసేది ఏమీ లేదని, డబ్బులిస్తున్నారు కాబట్టి ఆడుతున్నామన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొర్తజా వ్యాఖ్యలు భారత క్రికెటర్లకు సరిగ్గా సరిపోతాయి. కాసుల పంట పండించే ఐపిఎల్ టోర్నమెంటులో చెమటోడ్చి ఆడే భారత క్రికెటర్లు ప్రపంచ కప్, ఛాంపియన్ ట్రోఫీ వంటి టోర్నమెంట్లలో నడుం వంచడానికి అసలు ఇష్టపడరు. దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం కంటే వ్యక్తిగతంగా పేరు ఆస్తిపాస్తులు సంపాదించడంలోనే వీళ్లు ముందుంటారు. పాక్‌పై మ్యాచ్ ఓడిపోయిన వెంటనే నెపం అంతా కోచ్ కుంబ్లే మీదకు నెట్టేసి తక్షణం అతన్ని తొలగించాలని క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సిఫార్సు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతారహితమైన ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం విచిత్రం.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం