ఉత్తరాయణం

జన కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్
మనుషులంటే వనరులోయ్.. ‘పవరు’ నిండిన టవరులోయ్
మంది పెరిగితే మజ్జిగన్నది పలుచబడునని పాత మాటోయ్
మానవాళి ఏకమయ్యిన అద్భుతాలే చేయగలరోయ్
పుడమితల్లికి నిత్య పురుడై జనాభాయే పెరుగుచుండోయ్
ప్రకృతి కోపం, తీవ్రవాదం విధికి తోడై-
జనం కొందరు రాలుతుండోయ్
చైనా, భారత్ జనాభాలో ఒకటి రెండూ ర్యాంకులండోయ్
జనుల నైజం, పనులు, ప్రతిభలు మట్టిబట్టి మారుచుండోయ్
జనుడు ఎవడైన గాని గుండె గుప్పెడే ఉండునండోయ్
దేశం, భాష వేరు అయినా జీవక్రియలూ మారవండోయ్
సుఖం, శాంతి, సంతోషాలు వద్దనేటి జనులు ఎవరోయ్?
అహం, ధనం, మతం, ప్రాంతం కలహాల-
కుంపటి పెట్టుచుండోయ్
పగలు రాత్రులు మార్చుచుండెడి-
భూమాతకందరూ ఒకటేనండోయ్
ప్రాంతమంటూ హద్దులంటూ మార్చి బతికే-
మనుషులెప్పుడూ మారరండోయ్
జనము, జీవన ప్రమాణాలు తగిన రీతిన పెరగవలెనోయ్
జనాభాలో అధిక భాగం నైతికతను నిలుపవలెనోయ్
మానవులం మానధనులం.. మానవీయత మరువరాదోయ్
ధరణి సుతులుగ శాంతి కుసుమాలెన్నో పూయించవలెనోయ్
కలతలేని కుటుంబాలను జన నియంత్రణతో-
కల్పించవలెనోయ్
అనర్థాలను దరికి చేర్చక కుటుంబ నియంత్రణ
చేయవలెనోయ్...
(నేడు అంతర్జాతీయ జనాభా దినం)
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు