ఉత్తరాయణం

అందని టమాటా పుల్లన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన ధర లభించక రెండు నెలల క్రితం ‘రైతు గొంతులో పచ్చి టమాటా’గా మిగిలిన ఈ ప్రసిద్ధ కూరగాయ- నేడు ధర అమాంతం పెరిగి వినియోగదారులకు బరువుగా మారింది. పంట ఎక్కువై కిలో టమాటా ధర రూపాయి పలికి, గతిలేని పరిస్థితిలో రైతులు వాటిని బస్తాలకొద్దీ రోడ్డుమీదే పారవేసిన సంగతి ఇంకా మనం మరచిపోలేదు. ఈ పరిస్థితుల్లోనే దిగుబడి లేక టమాటా ధర కిలోకు వంద రూపాయలు పలకడం ఆశ్చర్యకరం. అయితే అప్పుడూ, ఇప్పుడూ రైతుకుగానీ, కొనుగోలుదారునికిగానీ ఊరట ఏ మాత్రం లేదు. కేవలం రెండు నెలల వ్యవధిలో టమాటా ధరలో ఇంతటి హెచ్చుతగ్గులుంటే అది ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. పంట ఎక్కువగా వచ్చినపుడు నిల్వ చేసే అవకాశం గానీ, కనీస మద్దతు ధర రైతుకి అందే ఏర్పాటు గానీ, అదనపువిలువ చేకూరేలా.. అంటే పచ్చళ్ళు, సాస్‌ల తరహాలో మార్చేలా పరిశ్రమల అందుబాటు కానీ లేకపోవడంతో అటు పంట వృథా అవుతుంది, ఇటు రైతులు నష్టపోతున్నారు. కొంచెం దిగుబడి తగ్గితే మాత్రం మార్కెట్‌లో దళారీలు మరింతగా ధరలు పెంచేస్తున్నారు. పెంచిన ధరలపై నియంత్రణ గానీ, సామంజస్యం గానీ ఉండడం లేదు. అన్ని నిత్యావసరాలదీ ఇదే కథ. ‘దిగుబడి ప్రకృతి దయ, ధరలు మార్కెట్ దయ’ తరహాగా ఉన్న దుర్భర పరిస్థితులను మార్చేలా ప్రభుత్వం కృషి చెయ్యాలి. రైతుకి, వినియోగదారునికి న్యాయం చేయడానికి తగు చర్యలు తీసుకోవడం ప్రజా ప్రభుత్వపు బాధ్యత.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం