ఉత్తరాయణం

చేనేతను జిఎస్‌టి పరిధినుంచి తప్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంపశయ్యపై ఉన్న చేనేతను జిఎస్టీ పరిధిలోకి చేర్చడం అత్యంత దురదృష్టకరం. చిలపనూలు, చేనేత వస్త్రాలపై 23 శాతం పన్ను విధించడంతో ఈ పరిశ్రమకు మరణ మృదంగం మోగించడమే అవుతుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ వీడి వేలాదిమంది చేనేత కార్మికులు ఇల్లు వదిలి, పల్లె దాటి సుదూర ప్రాంతాలకు వలసపోతున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది ప్రత్యామ్నాయ వృత్తులోకి వెడుతున్నారు. ఈ నికృష్ట నేపథ్యంలో చేనేతను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి భారీగా వడ్డింపులు విధించడం గాంధేయ సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడమే అవుతుంది. అందరూ చేనేత వస్త్రాలను ధరించాలని, పరిశ్రమను కాపాడాలని ప్రసంగాలు చేస్తున్న పాలకులు ఇలా వ్యవహరించడం సమంజసం కాదు.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

డిప్యుటేషన్ రద్దు చేయండి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన వారిని బదిలీలు చేస్తుంటే ఆర్థిక, రాజకీయ పలుకుబడి, సత్తా గల సిబ్బంది బదిలీ స్థానాల్లో ఓ వారం పనిచేసి డిప్యుటేషన్ పేరుతో గోడకు కొట్టిన బంతిలా యధాస్థానానికి చేరుతున్నారు. స్థానికంగా స్థిరపడడం, అప్పుడప్పుడు వచ్చే ఆమ్యామ్యాలు వదులుకోలేకపోవడం, కొత్త స్థానంలో ఈ వెసులుబాటు వుండకపోవడంతో పాటు రానుపోను రవాణా చార్జీలు లేదా అక్కడ అద్దె చెల్లించాల్సి రావడం వంటి వాటితో ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడుస్తున్నారు. డిప్యుటేషన్ ద్వారా మరో ఐదేళ్లు అదే కుర్చీని అంటిపెట్టుకుని దర్జాగా హోదాను అనుభవిస్తుండడంతో ప్రభుత్వ పథకాలు అర్హులకు సకాలంలో అందని దురవస్థకు కీలకమవుతున్నారు. మిగతా శాఖలకంటే జలవనరుల శాఖల సాంకేతిక సిబ్బంది సుమారు ఏభై శాతం ఈ విధంగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదా.పిడబ్ల్యుడి వర్క్‌షాప్, ధవళేశ్వరంలో జూనియర్ సూపరింటెండెంట్ 2-7-2009లో విధుల్లో చేరారు. 2014లో బదిలీ కావాలి. కానీ సార్వత్రిక బదిలీల్లో 6/2016న ఏలూరుకుబదిలీ అయి అదే నెలలో వారం తిరక్కుండానే యధాస్థానానికి డిప్యుటేషన్‌పై విధుల్లో చేరారు. ఆయన స్వగ్రామం, నివాసం అదేవూరు. రెండో సంవత్సరం గడుస్తున్నా ఇంకా ఇక్కడే కొనసాగడం, అవసరమైతే మరో నాలుగేళ్లు ఇక్కడే ఉంటాననడం ఆ అధికారికే చెల్లింది. ఇలా ఎంతోమంది డిప్యుటేషన్లలో కొనసాగడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. కావున డిప్యుటేషన్‌లు వెంటనే రద్దు చేసి పారదర్శకంగా నిలవాలని అందుకు ఏ సంస్థకు మినహాయింపు ఉండరాదు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

ఇద్దరు దిగ్గజాల మధ్య పోటీ!
రాష్టప్రతి ఎన్నికల్లో ఇద్దరు దిగ్గజాలపై పోటీ నెలకొని ఉంది. అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాధ్ కోవింద్ బిజెపి సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన న్యాయవాదిగా రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థిని పేద వర్గాల అభివృద్ధికి కృషి చేసే వ్యక్తిగా మంచి పేరు గడించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరాకుమార్ సైతం రాజకీయ అనుభవజ్ఞురాలు. నిస్వార్ధ సేవా తత్పరత కలిగిన మహిళగా లోక్‌సభ స్పీకర్‌గా సీనియర్ నాయకురాలిగా ఎంతో అనుభవం ఉంది. ఇద్దరు దిగ్గజాల మధ్య రసవత్తరమైన పోటీ వుంది. గట్టిపోటీ అని చెప్పవచ్చు కానీ అధికారపక్షానికి అవకాశం ఉంది. ఇద్దరు మచ్చలేని నేతలు కానీ ఇలా జరగడం కొంతమేర నష్టమే. ఎవరు గెలిచినా మంచి రాష్టప్రతిని ఎన్నుకున్నట్టు అవుతుంది. ఈ పోటీని ఇద్దరు దళితుల మధ్య పోటీగా అభివర్ణించకూడదు. ఎవరు గెలిచినా ఆనందదాయకమే. మంచి నాయకులు ఈ పోటీలో నిలబడడం హర్షణీయం.
-అయినం రఘురామారావు, ఖమ్మం

హిందువులనూ సమాదరించాలి
క్రైస్తవ ఎన్‌జీవోలను ఉపయోగించి బడుగు బలహీనవర్గాల్ని ప్రభావితం చేసి రానున్న ఎన్నికల్లో గెలవాలన్న కాంగ్రెస్ సమర వ్యూహం సరే కానీ ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ మైనార్టీలను బుజ్జగిస్తూ హిందువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపించడంవల్లనే 2014 ఎన్నికల్లో ఓడిందని నివేదిక ఇచ్చాడు. అంతేకాక యుపిఏ పాలనలో తెర వెనుక ప్రధానిగా సోనియా నియమించుకున్న సలహామండలిలో క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యమైన పదవులన్నీ వారికే ఇచ్చారు. ఎన్‌జివోలూ కాంగ్రెస్ తరఫునే పని చేసాయి. కానీ దారుణంగా ఓడిపోయారు. అలాంటి సమర వ్యూహాలవల్ల పని జరగదు. హిందువులనూ ఆమె సమాదరించాలి.
-చంపక్, కాకినాడ