ఉత్తరాయణం

గందరగోళంలో రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రాధమ్యాలు నిర్ణయించుకోవడంలో తడబడుతున్నట్టున్నారు. ‘అనవసరమైన చోట చొరబాటు, అవసరమైన చోట తడబాటు’ అన్నట్టుగా ఆయన ధోరణి కనిపిస్తోంది. ఇది ఆయనకు, కాంగ్రెస్ పార్టీకే కాకుండా ప్రతిపక్షాల ఐక్యతకు కూడా అడ్డంకిగా మారుతోంది. గతంలో ఒకానొక సందర్భంలో పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీని నిలదీయాలని ప్రతిపక్షాలన్నీ కూడబలుక్కున్నాయి. ఆ సందర్భం మేరకు నాయకత్వ బాధ్యతను మిగతా విపక్షాలు కాంగ్రెస్ పార్టీకే కట్టబెట్టాయి. ఇంతలో ఉన్నట్టుండి ఎవ్వరికీ చెప్పకుండా రాహుల్ తన పోరాట స్వరాన్ని అభ్యర్థనా స్వరంగా మార్చి ప్రధానిని కలిసి వేరే వినతులందించారు. ఆయన వినతులేమేరకు సఫలమయ్యాయో గానీ ప్రతిపక్షాల ఐక్యత మాత్రం దిగ్విజయంగా విఫలమైంది. అలాగే, తాజాగా చైనా, భూటాన్ రాయబారులను కలిసిన విషయం కూడా. వారిని రాహుల్ కలవడంలో ఏమాత్రం తప్పులేదు. కలిసే సమయమే ఒప్పుకాదు. అదీ చైనాతో సరిహద్దు వివాదం ముదిరిన వేళ. పోనీ కలిశాక తన చర్యను సమర్ధించుకున్నా బాగుండేది. ‘అబ్బే లేదు’ అని ఒకసారి, ‘అంతా మీడియా సృష్టి’ అని మరోసారి ఆయన అనుచరులు భుజం తడుముకోవడం వింత. ఇదంతా ముఖ్యమైన విషయాలపై ఆ పార్టీకున్న గందరగోళానికి, సమాచార లోపానికి దర్పణం. జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించాల్సిన పెద్ద ప్రతిపక్షానికి వుండాల్సిన గుణం కాదిది. ఆ తర్వాత రాహుల్ మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్టల్ల్రో అసెంబ్లీ స్థానాల పెంపునకు ఏమాత్రం ఒప్పుకోనని చెప్పారు. అది అంత బల్ల గుద్ది చెప్పాల్సిన విషయమా ఇది? ఆ బిల్లేదో చర్చకు వచ్చినపుడు తమ వ్యూహం మేరకు నడుచుకుంటే పోయేది కదా! అంతకన్నా ముఖ్య విషయాలైన విభజన హామీలపై గొంతెత్తితే బాగుండేది కదా! ప్రజాస్వామ్యంలో బలమైన అధికార పక్షానికి సమ ఉజ్జీగా బలమైన ప్రతిపక్షముంటేనే ప్రజలకు మేలు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి చర్యల్లో పరిపక్వత, పార్టీల మధ్య ఐక్యత ఇప్పుడెంతో అవసరం.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
హిందువులను సమాదరించాలి
క్రైస్తవ ఎన్‌జీవోలను ఉపయోగించి బడుగు బలహీనవర్గాల్ని ప్రభావితం చేసి రానున్న ఎన్నికల్లో గెలవాలన్న కాంగ్రెస్ సమర వ్యూహం సరే కానీ ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ మైనార్టీలను బుజ్జగిస్తూ హిందువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపించడంవల్లనే 2014 ఎన్నికల్లో ఓడిందని నివేదిక ఇచ్చాడు. అంతేకాక యుపిఏ పాలనలో తెర వెనుక ప్రధానిగా సోనియా నియమించుకున్న సలహామండలిలో క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యమైన పదవులన్నీ వారికే ఇచ్చారు. ఎన్‌జివోలూ కాంగ్రెస్ తరఫునే పని చేసాయి. కానీ దారుణంగా ఓడిపోయారు. అలాంటి సమర వ్యూహాలవల్ల పని జరగదు. హిందువులనూ ఆమె సమాదరించాలి.
-చంపక్, కాకినాడ