ఉత్తరాయణం

చైనా వస్తువులను బహిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర దేశాలతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా గాక బెదిరింపులతో కొనసాగిస్తూ లబ్ది పొందాలనుకోవడం చైనా రాజకీయ దుర్నీతిగా మారింది. తాజా సరిహద్దు వివాదం నేపథ్యంలో- 1962లో జరిగిన యుద్ధం నుండి గుణపాఠం నేర్చుకోమని మన దేశాన్ని చైనా హెచ్చరించింది. నిజమే.. ఆ యుద్ధంలో రక్షణ విషయంలో అజాగ్రత్త తగదని భారత్ మంచి గుణపాఠం నేర్చుకుంది గనుకే ఆ తరువాత పాకిస్తాన్‌తో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ తిరుగులేని విజయం సాధించింది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘పంచశీల’ అంటూ శాంతిని నమ్ముకుంటే, ‘్భరత్ చీనీ భారుూ భారుూ’ అంటూనే చైనా హఠాత్తుగా దొంగదెబ్బ తీసింది. అప్పుడు మన సైనికులకు నాటు తుపాకులే గానీ ఆధునిక ఆయుధాలు, ఆ మంచుకొండల్లో సరైన బూట్లు, నిత్యావసరాలు సకాలంలో అందక చైనా పైచేయి సాధించింది. కానీ, నేడు మన సైన్యం శత్రు దుర్భేద్యం. మరి.. గతంలో చైనాకూడా జపాన్ చేతిలో ఓటమిని చవిచూసింది. యుద్ధాలతో సమస్యలన్నీ తీరవు. పెరుగుతాయనేది చారిత్రక సత్యం. గతంలో ఎంతో సహాయం చేసిన రష్యాతో సైతం అవసరం తీరగానే చైనా వైరం పెట్టుకుంది. ‘సోదర వియత్నాం’ అంటునే సరిహద్దు ఘర్షణకు దిగితే చిన్న దేశమైనా వియత్నాం దీటుగా చైనాను ఎదుర్కొంది. పేరుకు పార్టీ పాలనే గానీ మావో కాలం నుంచి చైనాలో ఏకవ్యక్తి పాలనే. సామ్రాజ్యవాద పోకడలు, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులను ప్రోత్సహించడం వంటి చర్యలకు చైనా పాల్పడుతోంది.
చైనా మనం నమ్మదగని దేశం కనుక వారికే ఎక్కువ లాభం కలిగిస్తున్న ఆర్థిక బంధాలను తగ్గించుకోవాలి. కుప్పలుతెప్పలుగా మన మార్కెట్‌లోకి వచ్చి పడుతున్న చైనా వస్తువులను మనం బహిష్కరించాలి. ఉపాధి పేరిట పర్యావరణానికి కీడుతెస్తున్న పరిశ్రమల కోసం మన తెలుగు రాష్ట్రాల ఫ్రభుత్వాలు చైనాకు భారీ రాయితీలు ఇవ్వడం తగ్గించాలి. దేశీయంగా చిన్న తరహా, గ్రామీణ, పాడి పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఉపాధి పెరుగుతుంది. చైనా వస్తువులకు ధరలే కాదు నాణ్యత కూడా తక్కువే. కనుక మన దేశ వ్యాపారులు, ప్రజలు చైనా వస్తువులు కొనుగోళ్లు తగ్గిస్తే ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’లా పనిచేస్తుంది. గత రెండు ప్రపంచ యుద్ధాల విధ్వంసంతో తల బొప్పికట్టి నేడు యూరోపు దేశాలు సామరస్యంగా మెలుగుతూ అభివృద్ధి చెందుతుంటే, సిద్ధాంత రాద్ధాంతాలతో పశ్చిమాసియా ముస్లిం దేశాలు తీవ్రవాద ఘర్షణలతో ఉన్నత స్థాయి నుండి పేద స్థాయికి దిగజారిపోతున్నాయి. కనుక మనం కూడా కొంత రాజీ ధోరణితో కాశ్మీర్ లోయతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్ చేస్తే- మనకు లాభమే కానీ కొత్తగా వచ్చే నష్టం లేదు. అప్పుడు చైనా, పాకిస్తాన్‌ల దూకుడు తగ్గి అవి ఆత్మరక్షణలో పడతాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దేశంగా మన దేశం ఖ్యాతి పెరుగుతుంది. తీవ్రవాదం తగ్గుతుంది. దీర్ఘకాలిక సమస్య తీరుతుంది.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
ఇళ్ల మధ్య మద్యం వద్దు
ఇళ్ల మధ్య మద్యం షాపులు వద్దంటూ మహిళల నిరసనలు తీవ్రం కాగానే, 190 ప్రాంతాల్లో అలాంటి షాపులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోమని ఏపి ముఖ్యమంత్రి పోలీసుల్ని ఆదేశించారట. మంచిదే. అలాంటి షాపులున్న ఇతర ప్రాంతాల సంగతేమిటి? అక్కడివారు కూడా అలజడి రేపితేగాని చర్యలు తీసుకోరా? ఇళ్లమధ్య మద్యం షాపులుండరాదన్న ఇంగితం ఎక్సయిజ్ అధికారులకు లేదా? వాటికి లైసెన్స్ ఎలా ఇచ్చారు? అలజడి లేదు కదా అని మిగిలిన ప్రాంతాల్లో ఇళ్లమధ్య షాపులు కొనసాగితే మహిళల హృదయాలు క్రమంగా రాజుకొని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతారని పాలకులు గ్రహించాలి. ఇళ్లమధ్య ఉన్న కొనసాగుతున్న మద్యం షాపులన్నింటినీ తొలగించడమే విజ్ఞత.
-కె.సాహిత్యదీప్తి, రమణయ్యపేట
ఇప్పుడు టీచర్ల బదిలీలా?
ప్రభుత్వం వేసవి సెలవుల్లో ఏం చేసినట్టు? ఇప్పుడా టీచర్ల బదిలీలు? జూన్ నుంచి బదిలీల ఫీవర్‌లో ఉపాధ్యాయులు మనసుపెట్టి బోధించలేని పరిస్థితి. ఫలితంగా జూన్, జులై నెలలు విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తాయి. రెండు నెలలలోనే 41 పనిదినాలు పోతున్నాయి. ఆపై బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో స్థిరపడేసరికి మరొక నెల. వెరసి 60కిపైగా పనిదినాలు నష్టపోతారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద పిల్లలే కదా! వాళ్లు ఎలాపోతే మనకేంటని, ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు బదిలీలు చేపట్టడం సమర్ధనీయం కాదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైనా స్పందించి టీచర్ల బదిలీలు వేసవి సెలవుల్లోగా పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలి.
-సూరంపూడి రేణుక, రాజమండ్రి
కఠిన శిక్షలు అవసరం
మనిషిని ఆశావాది అనే కంటే అవకాశవాది, ఆశపోతు అనాలి. తనకు అందుబాటులోని ప్రతిదానిని స్వంతం చేసుకోవాలనే దురాశతో సాగుతూంటాడు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకొని మన ప్రభుత్వాలు మద్యం, సిగరెట్లు, గుట్కాలు, మత్తు పానీయాలను, పదార్థాలను అంగట్లో పెట్టి ఆదాయం గడిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కుళ్లబొడిచి, వారి సంపాదనను ఇవి కొల్లగొడుతున్నాయి. దీనినే అవకాశంగా తీసుకొని ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, ఉగ్రవాదులు హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను దిగుమతి చేస్తున్నారు. అమాయకులైన విద్యార్థులను, యువతను టార్గెట్ చేస్తూ మాయమాటలతో ప్రలోభపరుస్తూ తమ వ్యాపారాలను సాగిస్తూన్నారు. చట్టాలను సవరించాలి. శిక్షలు కఠినతరం చేయాలి. మాదకద్రవ్యాల వ్యాపారం చేసే వారిని, వాటిని సరఫరా చేసే వారిని కఠినంగా శిక్షించాలి. వీరంతా దేశద్రోహులే.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు