ఉత్తరాయణం

సమాచార హక్కు చట్టం ఇంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలనలో పారదర్శకత పెంచేందుకు దోహదం చేస్తూ, ప్రజల చేతిలో వజ్రాయుధంలా నిలిచిన ‘సమాచార హక్కు చట్టాని’కి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. కేంద్రంలో పాలించిన యుపిఏ ప్రభుత్వం పనె్నండు సంవత్సరాల క్రితం పదునైన ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పనె్నండేళ్ళ కాలంలో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని ఫలితాలు సాధించిన ఉద్యమకారులు ఎందరో వున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఈ చట్టంపై అవగాహన పెంచుకుని తమకు జరిగిన అన్యాయాలపై ప్రశ్నిస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు జరుగుతోంది. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని సమాచార కమిషనర్లను పదవుల నుంచి తొలగించారు. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు సైతం తమ తమ మాతృశాఖలకు వెళ్లిపోయినారు. రెండు రాష్ట్రాల నుండి కమిషన్ కార్యాలయానికి చేరిన సుమారు లక్షకుపైగా అప్పీళ్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపి రాష్ట్రాలలో సమాచార కమిషనర్ల నియామకం విషయమై నిర్దిష్ట ప్రతిపాదనలను తమ ముందుంచాలని హైకోర్టు ఈ రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. వాస్తవంగా కమిషనర్ల నియామకంలో ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. రెండు రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టం అమలు కావడం లేదు. ఈ విషయంలో ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇకనైనా స్పందించి ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించాలి. అర్హులైన వారిని, మేధావులను, రాజకీయ పార్టీలతో సంబంధం లేనివారిని, ఉద్యమకారులను సమాచార కమిషనర్లుగా నియమించాలి. పాలనలో పారదర్శకతను పెంచేలా, అవినీతిని అరికట్టేలా ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో కచ్చితంగా అమలుచేయాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జెడలపేట