ఉత్తరాయణం

అనుచితంగా వ్యవహరిస్తున్న నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలలో అధికారపక్ష నాయకులు, విపక్ష నాయకులు ఉద్యోగులపై సైతం అనుచితంగా వ్యవహరిస్తున్న సంఘటనలు ఎక్కువుతున్నాయి. టిఆర్‌ఎస్‌కు చెందిన ఒక మంత్రి ఇటీవల ఒక వ్యక్తిని బెదిరించిన ఘటన మరువకముందే మరో ఎంఎల్‌ఏ జిల్లా మేజిస్ట్రేట్‌గా చెప్పబడే కలెక్టర్‌పై అనుచితంగా వ్యవహరించడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేత అయిన వ్యక్తి సైతం ఒక సంఘటనలో కలెక్టర్‌ను దూషించడం బెదిరించడం జరిగింది. ఒక ఎంఎల్‌ఎ ఇసుక అక్రమ రవాణా నిర్వహిస్తుంటే వారి వ్యక్తులను నిలువరించినందుకు తహశిల్దార్ అయిన మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడడం జరిగింది. ఒక ఎంఎల్‌ఏ బహిరంగంగా వేరే పక్ష నాయకుడ్ని తన్నడం జరిగింది. ఆర్థిక బలం, అంగబలం, అధికారం బలం చూసుకుని అధికారులపై దాడులకు పాల్పడడం పరిపాటైంది. దీన్ని ప్రతిపక్షాలు ఉధ్యోగ సంఘాలు ఎండగట్టడం వల్ల గతంలో కొంతమేర తగ్గినా, మళ్లీ పునరావృత్తం అవుతున్నాయి. కలెక్టర్‌పై అనుచితంగా వ్యవహరించిన తీరుపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం ఒక కొసమెరుపుగా చెప్పవచ్చు. ఏదిఏమైనా ఇలాంటి నాయకులవల్ల పార్టీప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉంది.
-అయినం రఘురామారావు, ఖమ్మం
ఆలయాలపై జిఎస్‌టి భారం
దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థను సరళీకృతం, బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి అమలు చేయడం హర్షణీయం. ఇప్పటికే ప్రపంచంలో 86 దేశాలు ఈ ఏకీకృత పన్ను వ్యవస్థను అమలు చేస్తు గణనీయమైన ఆర్థికాభివృద్ధిని సాధించిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం వస్తు సేవాపన్ను చట్టంలో మతపరమైన వ్యవహారాల గురించి ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరం. ఇందువలన మతపరమైన అంశాలన్నీ ధనార్జన ధ్యేయంగా సాగే వ్యవహారంగా పరిగణింపబడుతు జిఎస్‌టి పరిధిలోకి వచ్చాయి. ఇరవై లక్షలు, ఆపై ఆదాయం వున్న దేవాలయాలన్నీ జిఎస్‌టి ద్వారా ప్రభావితం కాబోతున్నాయి. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. దేవాలయంలో ప్రవేశ రుసుములు, కల్యాణ మండపాల అద్దెలు, కల్యాణోత్సవాలు, ఆర్జతసేవలకు పన్ను కట్టాల్సి రావడం వలన అవి మరింత ప్రియం కానున్నాయి. ప్రపంచంలో ఎన్నో దేశాలు మత సంస్థలను జిఎస్‌టినుంచి మినహాయింపు ఇచ్చాయి. మనదేశంలో మాత్రం ఆధ్యాత్మికత ఒక వస్తువు లేదా సేవ కింద పరిగణించి పన్నులు విధించడం తద్వారా అదనపు భారం సామాన్య భక్తులపై మోపే ప్రయత్నించడం దురదృష్టకరం.
-ఎం.కనకదుర్గ, తెనాలి
అసాంఘిక శక్తులపై అదుపు లేదా?
దేశంలోనే ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖనగరంలో ఇటీవల పలు సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుస భూకుంభకోణాలు వేలాది ఎకరాలు కబ్జా అవుతున్న వార్తలు , హవాలా మార్గంలో వందల కోట్లు చేతులు మారిన సంఘటనలు, గత నాలుగు నెలల్లో ఇరవై కేజీలకు పైగా పట్టుబడిన గంజాయి, హెరాయిన్ వంటి మత్తుపదార్థాలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఎసిబి దాడులలో పట్టుబడిన అవినీతి తిమింగలాలు ఇలా ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలచిన విశాఖ నగరంలో అక్రమార్కులు చెలరేగిపోవడంపట్ల నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని యూనివర్సిటీలలో మత్తుమందు, మద్యం వాడకం ఎక్కువై విద్యార్థులు పట్టబగలే బరితెగించిన సంఘటనలు కూడా కొకొల్లలు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం