ఉత్తరాయణం

ఫిరాయింపులకు అడ్డుకట్ట ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వలాభం కోసం అధికార పార్టీలోకి ఫిరాయించే వారిపై చట్టరీత్యా వేటువేసేలా చట్టాలను కఠినతరం చేయాలి. ఓటర్లు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పదవుల కోసం పార్టీ మారడం సమంజసం కాదు. రకరకాలుగా ప్రలోభపెట్టో, భయపెట్టో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను అధికార పార్టీవారు చేర్చుకోవడం ఎంతవరకు హర్షించదగ్గ విషయం? ఎన్నో ఏళ్లుగా అండదండలుగా ఉంటూ రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన పార్టీని పదవీ వ్యామోహంతో వీడిపోవడం సరికాదు. ఓ పార్టీ తరఫున గెలిచిన వారు చట్టసభలకు రాజీనామా చేసి మరో పార్టీలోకి మారడం నైతికం. అధికార పార్టీలోకి వలసలను నివారించేలా అవసరమైతే ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేయాలి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో అధికార పార్టీలో చేరేవారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. దీన్ని నిరోధించి ఫిరాయింపుల చట్టాన్ని విధిగా అమలు జరిగే రీతిలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం వుంది. ఎన్నికల సమయంలో కొత్తపార్టీలు పెట్టి, తమ పార్టీ ఓడిపోతే అధికార పార్టీలోనో విలీనం చేసే పద్ధతికి కూడా స్వస్తి పలకాలి. ఒక పార్టీ సిద్ధాంతాల ప్రాతిపదికగా ప్రజలు ఓట్లు వేస్తే అందుకు భిన్నంగా వేరే పార్టీలోకి పోవడం భావ్యమా? ఇటువంటి స్వార్ధ రాజకీయాలకు చరమ గీతం పలకాలి. ఒక పార్టీ నుండి గెలిచిన ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాల వరకు ఆ పార్టీలోనే కొనసాగే రీతిలో చట్టం రావాలి. మెజారిటీ లేదని ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి ఆహ్వానించే పార్టీలను సైతం ఒక కంట కనిపెట్టి సంఖ్యాబలం లేకుంటే తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు ఇవి ఊపందుకున్నాయి. ఇపుడు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణం. ఈ సంస్కృతి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. బిజెపి నేతలు కొన్ని రాష్ట్రాల్లో తమకు మెజారిటీ లభించకపోయినా ఇతర పార్టీల వారిని తమవైపు తిప్పుకుని అధికారంలోకి వస్తున్నారు. ఫిరాయింపుదారులపై చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా పార్లమెంటులో చర్చ జరగాలి.
-అయినం రఘురామారావు, ఖమ్మం
మీరు చేస్తున్నది ఏమిటి?
ఆంగ్లభాషలో తాము చదివి, ఉద్యోగాలు సాధించి తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో, కానె్వంట్లలో చదివించేవారు మాతృభాష గురించి ఆలోచించాలి. ‘మా పిల్లలకు తెలుగు అసలే రాదు’ అని తమ బంధుమిత్రులతో గొప్పగా చెప్పుకుంటూ సంబరపడిపోయే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలుగు భాషా దినోత్సవం నాడు మాత్రం ‘తెలుగు భాషను ఉద్ధరిస్తామంటూ ప్రగల్బాలు పలుకుతారు. ఘనంగా ప్రకటనలిస్తారు. తమ ఇంటిని దిద్దుకోలేనివారు తెలుగు భాషని వెలిగిస్తారా? కొందరు తెలుగు పండితులు, కవులకు సైతం ఇది మినహాయింపు కాదు. వారు కూడా తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో, ప్రైవేటు కానె్వంట్లలో చదివిస్తున్నారు కదా! మరి వారికి ప్రభుత్వ బడుల గురించి, తెలుగు భాష వృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
-కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్