ఉత్తరాయణం

కోరికల చిట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకర.. శుభకరా! సుఖశాంతుల నిలయంగా
జగతిని మార్చుమయ్యా!
ఓ బాలగణపతీ! నీ లీలతో బాలలకు
బంగారు భవితను చూపవయ్యా!
శుక్లాంభరా! మాకు శుద్ధజ్ఞానమందించి
అజ్ఞాన చీకట్లు తొలగించవయ్యా!
ఓ బొజ్జ గణపయ్య! ఒజ్జవై విచ్చేసి
నాణ్యమైనట్టి విద్యను అందించవయ్యా!
ఓ బుద్ధి గణపయ్య! రావయ్య.. సద్బుద్ధినిచ్చి
యువతను సన్మార్గాన నడుపవయ్యా!
ఓ పాలచంద్రా! ఓ ధూమకేతు! లంచావతారాల్ని,
కామంధులను తరమవయ్యా!
ఓ గణపతీ! చూసావా మా దేశ బాధలు?
పరిష్కార మార్గాలు చూపించవయ్యా!
ఓ విఘ్ననాయక! నీకు వేవేల దండాలు!
సరిహద్దు బాధలను రూపుమాపవయ్యా!
ఓ శూర్పకర్ణా! నీదు శూలాన్ని చేపట్టి
క్రూర మానవుల కోరల్ని త్రుంచవయ్యా!
ఓ హేరంబుడా! మాకు శూరత్వమందించి
విజయపథమున మమ్ము నడిపించవయ్య!
ఓ గంభీర నినదాయ! వన్యాయ వరదాయ!
పర్యావరణ జాగృతిని జనులకందించవయ్యా!
ఓ మూషిక వాహనుడా! కాలుష్యమైనట్టి
ప్రతి అంశాన్ని శుద్ధి చేసెడి సాధనమీయవయ్యా!
ఓ లకుమికర, చింతామణి, వనప్రియా!
హరిత సంపదను గణనీయంగా పెంచవయ్యా!
ఓ పార్వతీ తనయుడా! ప్రకృతి స్వరూపుడా!
మట్టితో చేసేటి బొమ్మలో కొలువుండి
ముదముగా మా పూజలందుకోవయ్యా!
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు