ఉత్తరాయణం

అనుమతి అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పాదాలు మొక్కాలా?’ అంటూ విపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్ని రెచ్చగొట్టడానికి తప్ప కార్యసాధకులు చేయాల్సిన పనులు కావు. ఈ మధ్య గుజరాత్‌లో రాహుల్ ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు, సెక్యురిటీని కాదని ప్రైవేటు కారులో బయలుదేరి రాళ్లవానలో చిక్కుకున్నాడు. ఆ మధ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రలో హఠాత్తుగా సభాస్థలిని మార్చి గందరగోళం సృష్టించడంతో రైలు దహనం అయింది. అందుకు క్షమాపణ కాదు కదా.. కనీసం విచారం వ్యక్తం చేయలేదు ముద్రగడ. అందుకని ఇప్పుడాయన రూట్ వివరాలు, నిర్వహించే సభాస్థలి వివరాలు ఇస్తూ అనుమతి తీసుకుంటే ప్రజల్ని, ఆస్తుల్ని పోలీసులు రక్షించగలుగుతారు. అందుకే ఆందోళనలకు అనుమతి తీసుకోవాలి.
- ప్రసన్న, పేర్రాజుపేట

డ్రగ్స్ వ్యవహారం కొత్తేమీ కాదు
డ్రగ్స్ దందా ఎప్పటినుంచో కొనసాగుతోంది. గతంలో చిన్న చిన్న వేషాలు వేసే నటులను పట్టుకుని ఇటీవల మీడియా ముందు నిలబెట్టడం జరిగింది. ఆ మధ్య ఓ సినిమాలో యువ విలన్‌గా వేసిన ఒక వ్యక్తిని గతంలో అరెస్టు చేసారు. గతంలో ఒక ప్రముఖ హీరోగా చెప్పబడుతున్న తమ్ముడ్ని సైతం పట్టుకోవడం జరిగింది. గతంలో ఇంత సీరియస్‌గా తీసుకోలేదు. డ్రగ్స్ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయి ఇతర దేశాల నుండి ఇవి భారీగా దేశంలోకి రావడంతో అనేకమంది విదేశీయుల్ని అరెస్టు చేయడం జరిగింది. నిందితులైన వారికి తక్షణమే కఠిన శిక్షలు విధిస్తే కొంతమేర నివారించవచ్చు. డ్రగ్స్‌కు ముందు కళాశాలల్లో, పాఠశాలల్లోని కొందరు విద్యార్థులు గుట్కాలు విరివిగా వాడేవారు. గుట్కాలను బ్యాన్ చేసిన తరువాత విద్యార్థులు వాటి జోలికిపోవడం లేదు. అలాగే డ్రగ్స్ విషయంలో కూడ కఠిన తరంగా వుండాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా యువతనే టార్గెట్ చేస్తూ వ్యాపారులు దండుకుంటున్నారు. సినిమా వారి పేర్లు వెల్లడించిన మాత్రాన అందరూ దోషులు కాకపోవచ్చు. ఏది ఏమైనా డ్రగ్స్ సంస్కృతి నిర్మూలించడానికి ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేస్తున్న కృషి అభినందనీయం. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

మేటి క్రీడాకారులు స్పందించాలి
మన దేశంలో క్రీడాకారులు ఎనలేని గౌరవం పొందుతున్నారు. ఎక్కడైనా విజేతలకు అందించే ప్రతిష్టాత్మకమైన జ్ఞాపికలు, నజరానాలు అందుకుంటుంటే వాటిని మనం పొందినంత అనుభూతి పొందుతున్నాము. అలాగే వివిధ సంస్థలతోపాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నగదు, ఇంటి స్థలం, ఉద్యోగం వంటివి కల్పిస్తున్నారు. బహుమతులు పొందే క్రీడాకారుల్లో అత్యధికులు పేదలు, సామాన్యులు కారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించడానకి వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీని కోట్లాదిమంది వదులుకున్నారు. రైలులో ప్రయాణించే వృద్ధ ప్రయాణీకులు రాయితీని ఉపసంహరిచుకోవాలని పిలుపు ఇవ్వడంతో ఎందరో స్పందించారు. కోట్లాది రూపాయలను వివిధ రూపాల్లో నజరానాలుగా పొందే క్రీడాకారులు కొంతైనా ప్రభుత్వానికి దఖలు పరిస్తే మరి కొంతమందికి సంక్షేమ ఫలాలు అందించినవారు అవుతారు. ఇటీవల కొంతమంది క్రీడాకారులు గ్రామాలను దత్తత తీసుకుని కొంతమేర అభివృద్ధి చేస్తున్నారు. రాయితీలను వదులుకున్న వారి బాటలో క్రీడాకారులు పయనిస్తే ప్రజల మనసులనూ గెలుస్తారు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం